STOCKS

News


సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌..

Friday 5th October 2018
Markets_main1538726340.png-20892

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 1:20 సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 502 పాయింట్ల నష్టంతో 34,667 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 10,409 పాయింట్ల వద్ద ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గుదలపై కేంద్ర ప్రకటన నేపథ్యంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్టాక్స్‌ భారీగా పతనం కావడం, అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పడిపోవడం, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ప్రకటనకు ముందు పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్షీణించడం, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు.

నిఫ్టీ-50లో టైటాన్‌ 3 శాతానికిపైగా పెరిగింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 2 శాతానికిపైగా లాభపడింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. ఇదే సమయంలో హిందుస్తాన్‌ పెట్రోలియం 23 శాతం, బీపీసీఎల్‌ 19 శాతం, ఓఎన్‌జీసీ 15 శాతం, ఐఓసీ 14 శాతం, గెయిల్‌ 10 శాతం పతనమయ్యాయి. ఎంఅండ్‌ఎం, హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోల్‌ ఇండియా షేర్లు 3-5 శాతం శ్రేణిలో నష్టపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా మినహా మిగతావన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పడిపోయాయి. ఇక నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లు 3 శాతానికిపైగా పతనమయ్యాయి.   

కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ శుక్రవారం కూడా గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,169 పాయింట్లతో పోలిస్తే 72 పాయింట్ల నష్టంతో 35,097 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,599 పాయింట్లతో పోలిస్తే 85 పాయింట్ల నష్టంతో 10,514 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 



You may be interested

3శాతం నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Friday 5th October 2018

ముంబై:- ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి.  అందులో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వరంగ బ్యాంకు సూచి ఇంట్రాడేలో దాదాపు 3శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు సూచి గత ముగింపు(2,777.80)తో పోలిస్తే దాదాపు 2.75శాతం (71 పాయింట్లు) నష్టంతో 2,706.55 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంకు 6శాతం నష్టపోయింది. ఇండియన్‌

పాతాళానికి ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు

Friday 5th October 2018

రెండున్నరేళ్ల కనిష్టానికి బీపీసీఎల్‌ రెండేళ్ల కనిష్టానికి ఐఓసీ ఏడాదిన్నర కనిష్టానికి హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైంజ్‌ సుంకాలన్ని కేంద్రం లీటర్‌కు రూ.1.50, ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు లీటరుకు రూ.1.00 భరించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటనతో శుక్రవారం ఆయిల్‌ కంపెనీల ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 28 శాతం కుప్పకూలాయి. గత ట్రేడింగ్‌లో జైట్లీ ప్రకటన కారణంగా చివరి అరగంటలోనే ఆయిల్‌ కంపెనీ షేర్లు ఏకంగా 20శాతం నష్టపోయిన

Most from this category