STOCKS

News


మార్కెట్‌ క్రాష్‌

Monday 10th December 2018
Markets_main1544414276.png-22782

  • సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌
  • 10,500 సమీపంలోకి నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,693 పాయింట్లతో పోలిస్తే 185 పాయింట్ల నష్టంతో 10,508 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,673 పాయింట్లతో పోలిస్తే 469 పాయింట్ల నష్టంతో 35,204 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం పెరిగే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్‌ 508 పాయిం‍ట్ల నష్టంతో 35,165 వద్ద, నిఫ్టీ 156 పాయిం‍ట్ల నష్టంతో 10,537 వద్ద ట్రేడవుతున్నాయి. 
 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోవడం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, ఒపెక్‌ దేశాల ఆయిల్‌ సరఫరా తగ్గింపు నిర్ణయంతో క్రూడ్‌ ధరలు సోమవారం పెరగడం, భారత్‌ విదేశీ మారక నిల్వలు నవంబర్‌ 30తో ముగిసిన వారంలో 932.8 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 393.72 బిలియన్‌ డాలర్లకు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు రూ.400 కోట్లను వెనక్కు తీసుకెళ్లడం, రూపాయి డిసెంబర్‌ 7న 23 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.67 డాలర్ల వద్ద ముగియడం, డిన్యూక్లియరైజేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు ఉత్తర కొరియా.. చైనాకు తెలియజేయడం, రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పునిచ్చే అవకాశాలు ఉండటం, భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీలో 2.9 శాతానికి పెరగడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో టెక్‌ మహీంద్రా, ఐఓసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ  షేర్లు మాత్రమే లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌పీసీఎల్‌, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 3 శాతానికి పైగా పతనమయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3 శాతం మేర నష్టపోయింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌పీసీఎల్‌, గ్రాసిమ్‌ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి.  

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఎక్కువగా 2 శాతానికి పైగా పడిపోయింది. తక్కువగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.17 శాతం తగ్గింది. ఇక మిగతావన్నీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. 



You may be interested

రూపీ డౌన్‌

Monday 10th December 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం నష్టాల్లో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 54 పైసల క్షీణతతో 71.34 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 70.80గా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపాయి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ గత సెషన్‌లో 70.90 వద్ద ఉంది. డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ గత సెషన్‌లో 0.42 శాతం

మార్కెట్‌ ఎటు?

Monday 10th December 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 141 పాయింట్ల నష్టంతో 10,598 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 42 పాయింట్ల నష్టంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 109 పాయింట్ల నష్టంతో

Most from this category