STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 22nd October 2018
Markets_main1540180711.png-21336

  • సెన్సెక్స్‌ 370 పాయింట్లుకుపైగా జంప్‌
  • నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 10,400కుపైన ప్రారంభం

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,315 పాయింట్లతో పోలిస్తే 374 పాయింట్ల లాభంతో 34,689 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,303 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 10,405 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. అయితే వెంటనే ఇండెక్స్‌ లాభాలు తగ్గాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్‌ 143 పాయింట్ల లాభంతో 34,459 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 10,341 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్‌ శుక్రవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, క్రూడ్‌ ధరలు సోమవారం స్థిరంగా కొనసాగుతుండటం, దేశీ ఫారెక్స్‌ నిల్వలు అక్టోబర్‌ 12తో ముగిసిన వారంలో 5.143 బిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 394.46 బిలియన్‌ డాలర్లకు తగ్గడం, రూపాయి శుక్రవారం బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 29 పైసలు లాభంతో 73.32 వద్ద ముగియడం, విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుత నెల తొలి మూడు వారాల్లో దాదాపు రూ.32,000 కోట్లుమేర నిధులను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకెళ్లడం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ2 నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.5,005 కోట్లకు ఎగయడం, బ్యాంక్‌ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ హోల్డింగ్స్‌ సెప్టెంబర్‌ నెలలో మూడు నెలల కనిష్ట స్థాయి రూ.1.88 లక్షల కోట్లకు తగ్గడం, ఏసియన్‌ పెయింట్స్‌ సహా హిందుస్తాన్‌ జింక్‌ వంటి దాదాపు 38 కంపెనీలు సోమవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు.  

ఇక నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, వేదాంత, గెయిల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఐఓసీ, ఏసియన్‌ పెయింట్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతానికిపైగా పెరిగితే, యస్‌ బ్యాంక్‌ 2 శాతానికిపైగా పడిపోయింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు నష్టాల్లో ఉన్నాయి. మిగతావన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 1 శాతానికిపైగా పెరిగింది. 



You may be interested

రూపీ డౌన్‌..

Monday 22nd October 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం స్వల్పంగా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.36 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 73.33తో పోలిస్తే 0.05 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 73.41 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.93 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.922 శాతంగా ఉంది. బాండ్‌

మార్కెట్‌ ఎటు?

Monday 22nd October 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 70 పాయింట్ల నష్టంతో 22,462 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,071 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 2 పాయిం‍ట్ల లాభంతో 9,920 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ ఏకంగా 97 పాయింట్ల లాభంతో 2,647

Most from this category