STOCKS

News


మార్కెట్‌ స్పీడ్‌కు ఫెడ్‌ బ్రేకులు..

Thursday 20th December 2018
Markets_main1545278451.png-23088

  • 10,900 దిగువున నిఫ్టీ.. 80 పాయింట్లు డౌన్‌
  • సెన్సెక్స్‌ 160 పాయింట్లకు పైగా క్షీణత

అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గరువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,967 పాయింట్లతో పోలిస్తే 82 పాయింట్ల నష్టంతో 10,885 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,484 పాయింట్లతో పోలిస్తే 163 పాయింట్ల నష్టంతో 36,321 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. 

ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పావు శాతం పెంచడంతో.. రేట్ల శ్రేణి 2.25- 2.5 శాతానికి చేరడం, అదేసమయంలో 2019లో రెండు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చని పేర్కొనడం, అలాగే 2019లో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను 2.5 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గించడం, క్రూడ్‌ ఆయిల్‌ ధర బుధవారం పెరగడం, ఇండియన్‌ రూపాయి బుధవారం 5 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.39 వద్ద ముగియడం, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఐపీఓ మార్కెట్‌ డల్‌గానే ఉంటుందని కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ పేర్కొనడం, సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతుండటం, ఫెడ్‌ ఎఫెక్ట్‌తో అమెరికా మార్కెట్లు బుధవారం మళ్లీ పతనమవ్వడం వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు.  

నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎంఅండ్‌ఎం, యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, టైటాన్‌ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. హిందాల్కో, వేదాంత, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గెయిల్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌ఢీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హిందాల్కో , వేదాంత షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, బీపీసీఎల్‌ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు దాదాపు 1 శాతం మేర లాభపడ్డాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ మెటల్‌ ఎక్కువగా 1 శాతానికి పైగా నష్టపోయింది. You may be interested

రూపీ డౌన్‌

Thursday 20th December 2018

ఫెడ్‌ నిర్ణయం, ఆర్‌బీఐ మినిట్స్‌ ప్రభావం..  ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు తర్వాత ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు బుధవారం విడుదలైన ఆర్‌బీఐ పాలసీ సమావేశ వివరాలు.. అధిక ద్రవ్యోల్బణ, వృద్ధి రేటు క్షీణతపై ఆందోళనలు రేకెత్తించడంతో సెంటిమెంట్‌ దెబ్బతింది. ఉదయం 9:15 సమయంలో రూపాయి 70.54 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి

మార్కెట్‌ తగ్గుతుందా?

Thursday 20th December 2018

గురువారం స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 88 పాయింట్ల నష్టంతో 10,898 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో రేట్ల శ్రేణి 2.25- 2.5 శాతానికి చేరింది. 2019లో రెండు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చని పేర్కొంది.  ♦ అమెరికా ఆర్థిక వ్యవస్థ

Most from this category