STOCKS

News


లాభనష్టాల మధ్య సయ్యాట

Tuesday 11th September 2018
Markets_main1536638717.png-20139

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,922 పాయింట్లతో పోలిస్తే 95 పాయింట్ల లాభంతో 38,017 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,438 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 11,476 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు వెంటనే ఆవిరయ్యాయి. ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. అయితే మళ్లీ సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చాయి. 

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగానే ట్రేడవుతుండటం, అమెరికా తమ ప్రొడక్టులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తే.. ప్రతిగా మేం కూడా అదే విధానాన్ని అవలంబించాల్సి వస్తుందని చైనా హెచ్చరిండచం, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌తో మరోమారు భేటీ కావాలని కోరుకుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం 72.45 రికార్డ్‌ స్థాయి వద్ద ముగియడం, క్రూడ్‌ ధరలు మంగళవారం నిలకడగా కొనసాగుతుండటం, రూపాయి విలువ వచ్చే ఏడాది మార్చి నాటికి 73కు పతనం కావొచ్చని స్విస్‌ బ్రోకరేజ్‌ పేర్కొనడం, ద్రవ్యలోటు లక్ష్యం కట్టు తపొచ్చనే అంచనాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో భారత్‌ జీడీపీ వృద్ధి నెమ్మదించొచ్చని యూబీఎస్‌ పేర్కొనడం, ఆసియా-పసిఫిక్‌ ప్రాంత జీడీపీలో ఇండియా వాటా 2000లో 17.3 శాతానికి పెరిగిందని ఏడీబీ తెలియజేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, లుపిన్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక ఐటీసీ, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్తాన్‌ యూనిలివర్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్‌ మినహా మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి.  You may be interested

నిలకడగా రూపీ

Tuesday 11th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం ప్రారంభంలో స్వల్పంగా బలపడింది. అయితే వెంటనే ఆ లాభాలు ఆవిరయ్యాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు వెలుడి కానుండటం, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించడం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.42 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 72.45తో పోలిస్తే 0.02 శాతం పెరిగింది. ఇక

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 11th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌:- నేడు 1:1 నిష్పత్తిలో షేర్ల విభజన కానున్నాయి. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌:- తొలి త్రైమాసికంలో రూ.40 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో సాధించిన రూ.38 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 41శాతం అధికం. ఆదాయం గత క్యూ1లో రూ.383 కోట్లు నమోదు కాగా, ఈ క్యూ1లో 404 కోట్లను సాధించింది. సన్‌ ఫార్మా:- ఇజ్రాయెల్‌కు చెందిన టార్సియెస్‌

Most from this category