STOCKS

News


మార్కెట్‌ ఫ్లాట్‌

Thursday 22nd November 2018
Markets_main1542859542.png-22277

  • 10,612 వద్ద నిఫ్టీ ప్రారంభం
  • సెన్సెక్స్‌ 83 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,600 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో 10,612 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,199 పాయింట్లతో పోలిస్తే 83 పాయింట్ల లాభంతో 35,282 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తాజాగా 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించడం (3.7 శాతం నుంచి 3.5 శాతానికి), ప్రయాణికుల వాహన విక్రయ అంచనాలను రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రీసెర్చ్‌ కుదించడం (9-11 శాతం నుంచి 7-9 శాతానికి), క్రూడ్‌ ధరలు నిలకడగా ఉండటం, స్టీల్‌పై 25 శాతం.. అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై వివిధ దేశాలు ఫిర్యాదులను సమీక్షించేందుకు డబ్ల్యూటీవో వివాదాల పరిష్కార విభాగం ఒక ప్యానెల్‌ ఏర్పాటుకు అంగీకరించడం, ఫైనాన్షియల్‌ రంగంలో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడుతోందని ఐఎంఎఫ్‌ పేర్కొనడం, వరుస రెండు రోజులు పతనమౌతూ వస్తున్న అమెరికా మార్కెట్లు బుధవారం స్థిరంగా ముగియడం, ఒక్క కొరియా, షాంఘై సూచీలు ఇండెక్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం దాదాపుగా లాభాల్లో ట్రేడవుతుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ-50లో టెక్‌ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఐఓసీ, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 3 శాతం మేర, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 2 శాతానికిపైగా పడిపోయాయి. ఇక టెక్‌ మహీంద్రా 2 శాతానికి పైగా పెరిగింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ 1 శాతానికి పైగా పెరిగింది. నిప్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా పడిపోయింది. 



You may be interested

71 సమీపానికి రూపాయి

Thursday 22nd November 2018

ఇండియన్‌ రూపాయి జోరు తగ్గడం లేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి గురువారం మళ్లీ లాభపడి 71 సమీపస్థాయికి పెరిగింది. రూపాయి బలపడుతూ రావడం ఇది వరుసగా ఏడో సెషన్‌. 2017 ఫిబ్రవరి నుంచి చూస్తే రూపాయి వరుసగా ఇన్ని రోజులు ర్యాలీ చేయడం ఇదే ప్రథమం. క్రూడ్‌ ధరలు పతనం కావడం వల్ల ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణ భయాలు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది.  రూపాయి గత ఏడు సెషన్లలో దాదాపుగా

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Thursday 22nd November 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల నష్టంతో 10,616 పాయింట్ల వద్ద ఉంది.  ♦ప్రపంచ ఆర్థిక వృద్ధి ‘బలహీనత’ దిశగా పయనిస్తోందని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల వ్యవస్థ దిశగా పయనం వంటి

Most from this category