STOCKS

News


లాభాల్లో మార్కెట్లు

Wednesday 14th November 2018
Markets_main1542167642.png-21966

  • 10,600 మార్క్‌కు పైన నిఫ్టీ
  • సెన్సెక్స్‌ 180 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,582 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,634 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,144 పాయింట్లతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 35,330 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.

అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, గ్లోబల్‌ డిమాండ్‌పై నెలకొన్న ఆందోళనలు సహా ఓవర్‌సప్లై వంటి అంశాల కారణం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పడిపోవడం,  మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ పారదర్శకత లక్ష్యంగా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలకు కొత్త నిబంధనలను తీసుకురావడం, రూపాయి మంగళవారం 22 పైసలు రికవరీ అయ్యి అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.67 వద్ద ముగియడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు అక్టోబర్‌లో 42 శాతం వృద్ధితో రూ.7,985 కోట్లకు పెరగడం, ఆర్‌బీఐ నవంబర్‌ 15న మార్కెట్‌లో లిక్విడిటీని పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుండటం, ఎంఅండ్‌ఎం సహా దాదాపు 1,395 కంపెనీలు బుధవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, టాటా మోటార్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌, మారుతీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌ 5 శాతానికి పైగా, ఐఓసీ 4 శాతం, బీపీసీఎల్‌ 4 శాతానికి పైగా పెరిగాయి. సన్‌ ఫార్మా 2 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 3 శాతంమేర తగ్గాయి.  

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 



You may be interested

2 నెలల గరిష్టానికి రూపీ

Wednesday 14th November 2018

ఇండియన్‌ రూపాయి బలపడింది. రెండు నెలల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ధరల తగ్గుదల బాగా కలిసొచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 50 పైసలకుపైగా లాభపడింది. 72.16 వద్ద ప్రారంభమైంది. కాగా రూపాయి మంగళవారం 72.67 వద్ద ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సెప్టెంబర్‌ 21న తొలిసారిగా 72 స్థాయికి పడిపోయింది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 55.66

మార్కెట్‌ ఎటు?

Wednesday 14th November 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం లేదా 101 పాయిం‍ట్ల నష్టంతో 25,286 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.15 శాతం లేదా 4 పాయింట్ల నష్టంతో 2,722 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ స్థిరంగా 7,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ షేర్లు నష్టపోవడం వల్ల ఎస్‌అండ్‌పీ 500

Most from this category