STOCKS

News


లాభాలతో ఆరంభం..

Tuesday 9th October 2018
Markets_main1539057643.png-20941

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,474 పాయింట్లతో పోలిస్తే 147 పాయింట్ల లాభంతో 34,651 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,348 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్ల లాభంతో 10,390 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  

అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం (దక్షిణ కొరియా మార్కెట్‌కు సెలవు), ట్రేడ్‌ పాలసీ ఆందోళనలు సహా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఐఎంఎఫ్‌.. 2018, 2019 ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 3.9 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించడం, క్రూడ్‌ ధరలు మంగళవారం స్థిరంగా ఉండటం, రూపాయి సోమవారం కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిలకు పతనమై అమెరికా డాలర్‌తో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 74.06 వద్ద ముగియడం, ఆగస్ట్‌ చివరి నాటికి పి-నోట్స్‌ పెట్టుబడులు రూ.84,647 కోట్లకు పెరిగడం, మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో సెప్టెంబర్‌ నెలలో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి ఏకంగా 2.3 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు వెనక్కు వెళ్లిపోవడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, అదానీ పోర్ట్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌, గెయిల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మాత్రమే నష్టాల్లో ఉంది. నిఫ్టీ మీడియా రెండు శాతానికి పైగా, నిఫ్టీ మెటల్‌ ఒక శాతానికిపైగా లాభపడ్డాయి. 



You may be interested

రూపాయి స్వల్ప రికవరీ

Tuesday 9th October 2018

రూపాయి మంగళవారం స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.89 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపు 74.07తో పోలిస్తే 0.25 శాతం లాభపడింది. రూపాయి మంగళవారం 73.85 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.986 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.975 శాతంగా ఉంది. ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.6 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Tuesday 9th October 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 40 పాయిం‍ట్ల లాభంతో 26,486 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింట్ల నష్టంతో 2,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల నష్టంతో 7,736 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు

Most from this category