STOCKS

News


మళ్లీ గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభం

Friday 5th October 2018
Markets_main1538712175.png-20867

  • 34,831 పాయింట్లకు సెన్సెక్స్‌ 
  • 10,447  పాయింట్లకు నిఫ్టీ 

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ శుక్రవారం కూడా గ్యాప్‌డౌన్‌తోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,169 పాయింట్లతో పోలిస్తే 72 పాయింట్ల నష్టంతో 35,097 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,599 పాయింట్లతో పోలిస్తే 85 పాయింట్ల నష్టంతో 10,514 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ల నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:26 సమయంలో సెన్సెక్స్‌ 104 పాయింట్ల నష్టంతో 35,064 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 10,517 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,831 పాయింట్ల కనిష్ట స్థాయిని కూడా తాకింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,447 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. 

ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరగడం సహా ఫెడ్‌ వడ్డీ రేట్లను వేగంగానే పెంచొచ్చనే అంచనాలతో అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగియడం, ఈ క్రమంలోనే ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతుండటం (చైనా మార్కెట్‌కు సెలవు), రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన మానిటరీ పాలసీ సమావేశపు నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించనుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్రూడ్‌ ధరలు శుక్రవారం పెరిగాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో చర్చలు జరపనుండటం, రూపాయి గురువారం ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనమై అమెరికా డాలర్‌తో పోలిస్తే 73.81 వద్ద క్లోజవ్వడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల అప్పులు రూ.50,000 కోట్లకు తగ్గొచ్చని క్రిసిల్‌ అంచనా వేయడం, అమెరికాలో వీక్లి జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ 49 ఏళ్ల కనిష్ట స్థాయి సమీపంలోకి తగ్గడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ ఉదంతం నేపథ్యంలో ఆర్‌బీఐ..ఎన్‌బీఎఫ్‌సీలకు క్యాపిటల్‌ అడక్వసీ నిబంధనలను కఠినతరం చేయవచ్చనే అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, గెయిల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌, హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు అయిన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, గెయిల్‌, ఓఎన్‌జీసీ వంటివి 10-23 శాతం శ్రేణిలో నష్టపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.  



You may be interested

రూపీ ఫ్లాట్‌..

Friday 5th October 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. స్వల్ప నష్టాలతో ప్రారంభమైన రూపాయి వెంటనే రికవరీ అయ్యింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశపు నిర్ణయం శుక్రవారం వెలువడనుండటంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. కాగా ఆర్‌బీఐ వరుసగా మూడోసారి కూడా వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది.     ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.59 వద్ద ట్రేడవుతోంది. మునపటి ముగింపు 73.58తో

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 5th October 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్లు గురువారం నష్టపోయాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటం వల్ల ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుతూనే ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఏర్పడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ గత ఆరు సెషన్లలోనూ తొలిసారి పడిపోయింది. జూన్‌ 25 నుంచి చూస్తే నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఎక్కువగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 201 పాయిం‍ట్ల నష్టంతో

Most from this category