News


లాభాల్లోంచి వెంటనే నష్టాల్లోకి..

Friday 9th November 2018
Markets_main1541736248.png-21802

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,598 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,237 పాయింట్లతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 35,258 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్‌ 149 పాయింట్ల నష్టంతో 35,088 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,553 వద్ద ట్రేడవుతున్నాయి.

ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగియడం, ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతో ట్రేడవుతుండటం, నాలుగు నౌకాశ్రయాల కన్సార్షియంకు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐఎల్‌)లో ప్రభుత్వ వాటాల వ్యూహాత్మక విక్రయాలకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయడం, వచ్చే ఏడాదిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో సమావేశమయ్యే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొనడం, ఇండియన్‌ జీడీపీ రేటు 2019లో 7.3 శాతానికి తగ్గొచ్చని మూడీస్‌ అంచనా వేయడం, రిజర్వు బ్యాంక్‌ వచ్చే ఏడాది మార్చి కల్లా డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయవచ్చనే అంచనాలు, దాదాపు 74 కంపెనీలు శుక్రవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

ఇక నిఫ్టీ-50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఐఓసీ, ఇండస్‌ండ్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 3 శాతానికిపైగా పడిపోతే, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేరు 3 శాతానికిపైగా పెరిగింది.

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఎక్కువగా లాభపడితే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఎక్కువగా నష్టపోయింది.

 You may be interested

ఫెడ్‌ రేట్లు యథాతథం..!

Friday 9th November 2018

గురువారం ముగిసిన ఫెడ్‌ రెండు రోజుల సమావేశం బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు యథాతథం డిసెంబర్‌లో పెంపు దిశగా నిర్ణయాలు.. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేకుండా అమెరికా ఫెడ్‌ రెండు రోజుల సమవేశాన్ని ముగించింది. ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును 2-2.25 శాతం శ్రేణిలో యథాతథంగా కొనసాగించేందుకు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఏకగ్రీవ అంగీకారం తెలిపింది. అయితే డిసెంబర్‌ సమావేశంలో పావుశాతం పెంపు వుండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. అమెరికా ఆర్థిక

పీఈ మల్టీపుల్స్‌ చూడండి..!

Friday 9th November 2018

వచ్చే ఏడాదిలో బలమైన ఎర్నింగ్స్‌కు అవకాశం వాల్యుయేషన్స్‌ సమంజసం నాణ్యమైన యాజమాన్యం, ఆరోగ్యకర కార్పొరేట్‌ పాలన పలు రంగాలకు సానుకూలంగా మారనున్న ప్రస్తుత స్థూల అంశాలు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బీ గోప్‌కుమార్‌ సంవత్‌ 2075 అంచనాలు ఇవి ముంబై: పెట్టుబడులను పెంచడం ద్వారా మంచి రాబడిని పొందే అవకాశాన్ని ఇప్పుడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అందిస్తున్నాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బీ గోప్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ

Most from this category