STOCKS

News


35,000 పైన సెన్సెక్స్‌

Tuesday 6th November 2018
Markets_main1541477149.png-21731

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,524 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల లాభంతో 10,552 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,950 పాయింట్లతో పోలిస్తే 126 పాయింట్ల లాభంతో 35,076 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగానే ట్రేడవుతుండటం (సింగపూర్‌ మార్కెట్‌కు మాత్రం సెలవు), ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మళ్లీ అమల్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి తగ్గుతుందనే ఆందోళనలు కారణంగా క్రూడ్‌ ధరలు మంగళవారం కూడా తగ్గడం, రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 67 పైసలు క్షీణించి 73.12 వద్ద ముగియడం,  అమెరికా.. ఇరాన్‌పై ఆంక్షల విషయంలో 8 దేశాలకు మినహాయింపునివ్వడం (ఇందులో భారత్‌ కూడా ఉంది), వచ్చే మార్చి నాటికి రూపాయి 71 స్థాయికి బలపడవచ్చని క్రిసిల్‌ అంచనా వేయడం, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఐపీవోకు సెబీ అనుమతినివ్వడం, దాదాపు 46 కంపెనీలు మంగళవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం, క్యూ2లో నికర లాభం తక్కువగానే ఉన్నప్పటికీ... బ్యాంక్‌ పనితీరు బాగా మెరుగుపడిందని.. రానున్న కాలంలో లాభాలు మరింత పుంజుకుంటాయని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ విశ్వాసం వ్యక్తంచేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో వేదాంత, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌యూఎల్‌, ఐఓసీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, ఏసియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వేదాంత షేరు 8 శాతానికిపైగా ఎగసింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ దాదాపుగా లాభాల్లోనే ఉన్నాయి. అయిత ఒక్క నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. 
 



You may be interested

బలపడిన రూపాయి

Tuesday 6th November 2018

17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభం ఇండియన్‌ రూపాయి మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ ఆరంభించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 17 పైసలు లాభంతో 72.95 వద్ద ప్రారంభమైంది. బ్యాంకులు, ఎగుమతిదారులు.. అమెరికా డాలర్లను విక్రయించడం ఇందుకు కారణం. కాగా రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 67 పైసలు క్షీణించి 73.12 వద్ద క్లోజయ్యింది. రెండు సెషన్లలో బలపడుతూ వచ్చిన ఇండియన్‌ రూపాయి సోమవారం రోజు తీవ్ర ఒత్తిడికి గరయ్యింది.

మార్కెట్‌ ఎటు?

Tuesday 6th November 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగానే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.76 శాతం లేదా 190 పాయిం‍ట్ల లాభంతో 25,461 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.56 శాతం లేదా 15 పాయింట్ల లాభంతో 2,738 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే నాస్‌డాక్‌ కంపొసిట్‌ మాత్రం 0.38 శాతం లేదా 28 పాయింట్ల నష్టంతో 7,328 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌,

Most from this category