STOCKS

News


నష్టాలతో బోణి

Monday 10th September 2018
Markets_main1536552190.png-20104

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,389 పాయింట్లతో పోలిస్తే 41 పాయింట్ల నష్టంతో 38,348 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,589 పాయింట్లతో పోలిస్తే 19 పాయింట్ల నష్టంతో 11,570 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 

అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, చైనా దిగుమతులపై అదనంగా 267 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమౌతుండటం, జపాన్‌ జీడీపీ వృద్ధి రేటు ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో అంచనాలు మించి 3 శాతంగా నమోదవ్వడం, చైనా సహా భారత్‌ వంటి దేశాలకు సబ్సిడీలను నిలిపివేస్తామని ట్రంప్‌ పేర్కొనడం, భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు ప్రస్తుత క్యూ1లో స్వల్పంగా 2.4 శాతానికి తగ్గడం, అమెరికాలో ఉత్పత్తి తగ్గడం సహా ఇరాన్‌పై ఆంక్షల కారణంగా క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగడం, ఫారెక్స్‌ నిల్వలు ఆగస్ట్‌ 31తో ముగిసిన వారంలో ఏకంగా 1.19 బిలియన్‌ డాలర్ల క్షీణతతో 400.1 బిలియన్‌ డాలర్లకు తగ్గడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు ఆగస్ట్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.25 లక్షల కోట్లకు చేరడం, విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.5,600 కోట్లను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకోవడం, కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సెబీ ఊరటనివ్వడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్‌, లుపిన్‌, ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, హీరో మోటొకార్ప్‌, యస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హిందుస్తాన్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 10th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యాక్సి్స్‌ బ్యాంక్‌:- కొత్త ఎండీ&సీఈవోగా అమితాబ్‌ చౌదరి నియమాకం ఖరారైంది. జనవరి 1న నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌:- కొత్త ఎండీ&సీఈవో నియమాకంపై సెప్టెంబర్‌ 12న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- సంస్థ స్వతంత్య్ర డైరెక్టర్‌గా శరత్‌ శర్మ నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. సోరెల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- వ్యాపార విస్తరణ, భవిష్యత్‌ వ్యాపార ప్రణాళికల అమలు కొరకు అవసరమయ్యే

మార్కెట్‌ ఎటువైపు?

Monday 10th September 2018

నిఫ్టీ శుక్రవారం 11,558 వద్ద ప్రారంభమైంది. అయితే తర్వాత 11,500 దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 11,484 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత మళ్లీ పుంజుకొని 11,603 గరిష్ట స్థాయికి ఎగసింది. అయితే ఈ స్థాయిల్లో కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. దీంతో ఇండెక్స్‌ 11,600 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. చివరకు 52 పాయింట్ల నష్టంతో 11,589 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌ డైలీ చార్ట్స్‌లో చిన్న బుల్లిష్‌

Most from this category