STOCKS

News


ఫ్లాట్‌ ఓపెనింగ్‌

Thursday 15th November 2018
Markets_main1542254005.png-22012

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,576 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 10,580 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,141 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 35,145 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లోనే ముగియడం, లిక్విడిటీ సంబంధిత సమస్యల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు ఉపశమనం కలిగించడం సహా ఎంఎస్‌ఎంఈలకు లెండింగ్‌ నిబంధనలను సరళతరం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆర్‌బీఐ బోర్డ్‌ నవంబర్‌ 19న సమావేశం కానుండటం, రూపాయి బుధవారం 36 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.31 వద్ద ముగియడం, క్రూడ్‌ ఉత్పత్తి దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొచ్చనే అంచనాల వల్ల బాగా పడుతూ వచ్చిన ఆయిల్‌ ధరలు బుధవారం మళ్లీ దాదాపు 1 శాతంమేర ఎగయడం, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్‌ ఇన్వెస్టర్లు సిప్‌లకు అధిక ప్రాధాన్యమిస్తుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్‌ లక్ష్యాన్ని (రూ.11.5 లక్షల కోట్లు) దాటుతాయని సీబీడీటీ చీఫ్‌ సుశీల్‌ చంద్ర ధీమా వ్యక్తంచేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హీరో మోటొకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐఓసీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బీపీసీఎల్‌, హిందుస్తాన్‌ యూనిలివర్‌, టీసీఎస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 8 శాతానికిపైగా, యస్‌ బ్యాంక్‌ 2 శాతానికిపైగా పడిపోయాయి. హీరో మోటొకార్ప్‌, టైటాన్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఎక్కువగా పెరిగాయి. 



You may be interested

లాభాల్లో రూపీ

Thursday 15th November 2018

ఇండియన్‌ రూపాయి వరుసగా మూడో సెషన్‌లోనూ బలపడింది. క్రూడ్‌ ధరల తగ్గుదల, ఆసియా కరెన్సీలు లాభపడటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 0.38 శాతం పెరుగుదలతో 72.06 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 72.31గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం 72.06 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.732 శాతంగా

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Thursday 15th November 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 1 పాయింటు లాభంతో 3,044 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 12 పాయింట్ల లాభం 9,804 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 10 పాయింట్ల నష్టంతో 2,645 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 5 పాయింట్ల నష్టంతో 2,063

Most from this category