STOCKS

News


పాజిటివ్‌ ఓపెనింగ్‌

Monday 24th December 2018
Markets_main1545623990.png-23182

  • 10,780 వద్ద నిఫ్టీ ప్రారంభం
  • సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,754 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 10,780 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,742 పాయింట్లతో పోలిస్తే 117 పాయింట్ల లాభంతో 35,859 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఇండెక్స​ లాభాలు తగ్గాయి. ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. 

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ (జపాన్‌ మార్కెట్‌కు సెలవు) సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమవ్వడం, ఇండియన్‌ రూపాయి శుక్రవారం 48 పైసలు నష్టపోయి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.18 వద్ద ముగియడం, టీవీలు/ మూవీ టికెట్లు/ సిమెంట్‌/ వాహన విడిభాగాలు సహా దాదాపు 23 ప్రొడక్టులపై జీఎస్‌టీ కౌన్సిల్‌ శనివారం పన్ను రేట్లు తగ్గించడం, విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్‌లో ఇప్పటి దాకా ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్లలో రూ.4,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం, ఫెడరల్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ను పదవి నుంచి తప్పించేందుకు తనకు అధికారం ఉందా? అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ‍ట్రంప్‌.. క్యాబినెట్‌ సభ్యులను అడినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డటం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా/ విజయా బ్యాంక్‌/ దేనా బ్యాంక్‌ విలీనం ఈ నెల చిరవకు ఖరారు కావొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొనడం, ఆర్‌బీఐ.. డిజిటల్‌ పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ ఏర్పాటు కోసం టీసీఎస్‌, విప్రో, ఐబీఎం ఇండియా సహా మారో మూడు సంస్థలను ఎంపిక చేయడం వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, విప్రో, సిప్లా, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హీరో మోటొకార్ప్‌, వేదాంత, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గెయిల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటొకార్ప్‌ దాదాపు 3 శాతం మేర నష్టపోయింది. వేదాంత, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. ఇక ఇన్ఫోసిస్‌ 1 శాతానికి పైగా లాభపడింది. సన్‌ ఫార్మా, టీసీఎస్‌ షేర్లు దాదాపు 1 శాతం మేర పెరిగాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు ఎక్కువగా పెరిగితే.. నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు ఎక్కువగా పడిపోయాయి. You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 24th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎఫ్‌ఎంజీసీ షేర్లు:- జీఎస్‌టీ మండలి శనివారం నిర్వహించిన సమావేశంలో 23 రకాల వస్తు, సేవల పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేటి ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంజీసీ షేర్లు ఫోకస్‌లో వుండొచ్చు. సిమెంట్స్‌ షేర్లు:- సిమెంట్‌ ధరపై జీఎస్‌టీని తగ్గించాలని జూలైలో కౌన్సిల్‌ చర్చించనా, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో సిమెంట్‌

మార్కెట్‌ ఎటు?

Monday 24th December 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:49 సమయంలో 9 పాయింట్ల లాభంతో 10,769 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,040 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 8 పాయింట్ల నష్టంతో 9,638

Most from this category