STOCKS

News


ప్రారంభంలో ఫ్లాట్‌.. వెంటనే నష్టాల్లోకి..

Monday 5th November 2018
Markets_main1541390776.png-21693

  • 35,000 మార్క్‌ దిగువున సెన్సెక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,553 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల లాభంతో 10,558 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,011 పాయింట్లతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 35,118 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:33 సమయంలో సెన్సెక్స్‌ 77 పాయింట్ల నష్టంతో 34,935 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 10,534 వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాలతో ట్రేడవుతుండటం (జపాన్‌ మార్కెట్‌కు సెలవు), ఇరాన్‌పై 2015 న్యూక్లియర్‌ డీల్‌ కింద ఎత్తివేసిన ఆంక్షలన్నింటినీ తిరిగి నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రావడం, చర్చలు సత్ఫలితాలు అందించొచ్చని.. వాణిజ్యానికి సంబంధించి చైనాతో డీల్‌ కుదుర్చుకునే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొనడం, అదే సమయంలో చైనా ప్రొడక్టులపై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ఆయన హెచ్చరించడం,  ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించి అమెరికా మినహాయింపునిచ్చిన ఎనిమిది దేశాల్లో భారత్‌ ఉండటం, క్రూడ్‌ ధరలు సోమవారం తగ్గడం, వచ్చే మూడు నెలల కాలంలో రూపాయి విలువ 76 స్థాయికి చేరొచ్చని యూబీఎస్‌ అంచనా వేయడం, రూపాయి శుక్రవారం ఏకంగా 100 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.45 వద్ద ముగియడం, దేశీ ఫారెక్స్‌ నిల్వలు అక్టోబర్‌ 26తో ముగిసిన వారంలో 1.44 బిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 392.07 బిలియన్‌ డాలర్లకు క్షీణించడం, ఎఫ్‌పీఐలు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో రూ.38,900 కోట్లను వెనక్కు తీసుకోవడం, ఎస్‌బీఐ సహా దాదాపు 205 కంపెనీలు సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను సోమవారం వెల్లడించనుండటం, ప్రభుత్వ బ్యాంకులకు మరో రూ.54,000 కోట్లు అందించేందుకు కేంద్రం రెడీ అవుతుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గెయిల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోల్‌ ఇండియా, సిప్లా, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఐఓసీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, పవర్‌గ్రిడ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐఓసీ, ఎన్‌టీపీసీ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా 2 శాతానికిపైగా పెరిగింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు లాభాల్లో ఉన్నాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పెరిగాయి. 



You may be interested

క్షీణించిన రూపాయి

Monday 5th November 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం బలహీనపడింది. ఆసియా కరెన్సీలు నష్టపోవడం, అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌పై నెలకొన్న ఊహాగానాలు, అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా బాగుండటం వంటి అంశాలు ఇందుకు కారణం. ఉదయం 9:05 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.78 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 72.44తో పోలిస్తే 0.52 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 72.88 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Monday 5th November 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.43 శాతం లేదా 110 పాయిం‍ట్ల నష్టంతో 25,270 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.63 శాతం లేదా 17 పాయింట్ల నష్టంతో 2,723 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 1.04 శాతం లేదా 77 పాయింట్ల నష్టంతో 7,356 పాయింట్ల వద్ద ముగిసింది. యాపిల్‌ మార్కెట్‌క్యాప్‌

Most from this category