STOCKS

News


మళ్లీ లాభాతోనే...

Tuesday 7th August 2018
Markets_main1533615287.png-18985

  • కొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద సూచీలు ఆరంభం
  • సెన్సెక్స్‌ 37,849 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,423 పాయింట్ల వద్ద ప్రారంభం

మార్కెట్లు మంగళవారం కూడా సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ఆరంభమయ్యాయి. సెనెక్స్‌ 37,840 మార్క్‌కు పైన, నిఫ్టీ 11,420 మార్క్‌కు పైగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 37,849 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,423 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాగా మార్కెట్లు సోమవారం కూడా ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్‌ 136 పాయింట్ల లాభంతో 37,692 పాయింట్లకి, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,387 పాయింట్లకు పెరిగాయి.  
అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లోనే ముగియడం, ఆసియాలోని ప్రధాన సూచీలన్నీ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 28 పైసలు క్షీణతతో రెండు వారాల కనిష్టానికి పడిపోవడం, సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ సహా మోంటోకార్లే ఐపీవోకు సెబీ అనుమతి, సౌదీ అరేబియాలో క్రూడ్‌ ఉత్పత్తి తగ్గొచ్చనే అంచనాలతో ఆయిల్‌ ధరలు పెరగడం, పెప్సికో చీఫ్‌గా ఇంద్రానూయి తప్పుకోనుండటం, దాదాపు 138 కంపెనీలు జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, ఏసియన్‌ పెయింట్స్‌, వేదాంత షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, సిప్లా, లుపిన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఫిన్‌ సర్వీస్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 
 You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 7th August 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఆంధ్రా బ్యాంకు:- ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ పద్ధతిలో ప్రభుత్వానికి షేర్ల కేటాయింపు ద్వారా రూ.2019  కోట్లను సమీకరించనుంది. ఈ మేరకు ఆగస్ట్‌ 10వ తారీఖున బోర్డు సమావేశం నిర్వహించనుంది. మహీం‍ద్రా అండ్‌ మహీంద్రా:- జూలైలో మొత్తం ఉత్పత్తులు 47, 605 నమోదు కాగా, అమ్మకాలు 44,563, ఎగుమతులు 2550లుగా నమోదయ్యాయి. కరూర్‌ వైశ్యా బ్యాంకు:- సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఆగస్ట్‌ 07 నుంచి అమల్లోకి

బీమా కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే ముందు...!

Monday 6th August 2018

ఇంటర్నెట్‌ వినియోగించే వారికి బీమా పాలసీల ప్రకటనలు కనిపించడం సహజం. ప్రతి రోజూ కేవలం రూ.11కే ఇంత మొత్తం బీమా పాలసీ అనేది ఆ ప్రకటనలో ఉంటుంది. క్లిక్‌ చేస్తే అక్కడి నుంచి మీరు మరో పోర్టల్‌కు వెళతారు. వివిధ బీమా సం‍స్థల పాలసీలు, వాటిలో ఉన్న ఫీచర్లు, ప్రీమియం తదితర వివరాలు అందించే సైట్లు అవి. ఈ వివరాలు తెలుసుకునే ముందు తమ పేరు, మొబైల్‌ నంబర్‌, ఈ

Most from this category