STOCKS

News


నష్టాల్లోకి మార్కెట్‌..

Tuesday 7th August 2018
Markets_main1533623156.png-19008

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు ఆవిరైపోయాయి. మంగళవారం సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తర్వాత మళ్లీ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. మార్నింగ్‌ సెషన్‌లో సెనెక్స్‌ 37,840 మార్క్‌కు పైన, నిఫ్టీ 11,420 మార్క్‌కు పైగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 37,849 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,423 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 
సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా డౌన్‌
లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ గంట తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఒకానొక సందర్భంలో 105 పాయింట్లకుపైగా క్షీణించింది. ఇక నిఫ్టీ కూడా ఒకానొక సమయంలో 27 పాయింట్ల మేర పడిపోయింది. ఇండెక్స్‌లలో అధిక వెయిటేజ్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా షేర్ల పతనం ఇందుకు ప్రధాన కారణం. 

కాగా మార్కెట్లు సోమవారం కూడా ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్‌ 136 పాయింట్ల లాభంతో 37,692 పాయింట్లకి, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,387 పాయింట్లకు పెరిగాయి.  



You may be interested

రూపాయి ఉండాల్సింది 71 స్థాయి వద్ద!

Tuesday 7th August 2018

కౌశిక్‌ బసు రూపాయి ఇప్పటికీ ఓవర్‌ వాల్యూడ్‌గా ఉందని, డాలర్‌తో పోలిస్తే 70- 71 స్థాయి వద్ద రూపాయికి ఫెయిర్‌వాల్యూ అని ప్రముఖ ఎకనమిస్టు, ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వర్ధమాన ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధ్వాన్న ప్రదర్శన చూపిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ రేట్లు పెంచడం, క్యాడ్‌ విస్తరించడం... రూపాయిని కుంగదీశాయి. ప్రస్తుతం రూపాయి 68- 69 స్థాయిల వద్ద

స్థిరంగా పసిడి

Tuesday 7th August 2018

ముంబై:- అంతర్జాతీయంగా పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ భయాలతో పాటు, ఆసియాలోని మార్కెట్లు మిశ్రమ ట్రేడింగ్‌ పసిడి ధర స్థిరమైన ర్యాలికి కారణమవుతున్నాయి.  ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర భారత కాలమానం ప్రకారం గం.10:15ని.లకు 0.70 డాలర్లు స్వల్పంగా పెరిగి  1,218.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌

Most from this category