STOCKS

News


ఓపెనింగ్‌ ఓకే.. అయినా నష్టాలే..

Tuesday 4th September 2018
Markets_main1536034311.png-19926

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,312 పాయింట్లతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 38,461 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో  ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,582 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 11,598 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు కార్పూరంలా క్షణాల్లో కరిగిపోయాయి. ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:37 సమయంలో సెస్సెక్స్‌ 93 పాయింట్ల నష్టంతో 38,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 11,546 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.  

ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం, పెసో సోమవారం రికార్డ్‌ కనిష్ట స్థాయికి పడిపోవడంతో అర్జెంటీనా అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటోందని సమస్యను అధిగమించడానికి కఠిన పొదుపు చర్యలు అవలంబించాల్సి ఉందని ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రిఫైనరీలు ఇరానియన్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకోవచ్చని అనుమతినివ్వడం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరానియన్‌ ఆయిల్‌ ఔట్‌పుట్‌ తగ్గుతుందనే భయాల వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మంగళవారం పెరిగడం, రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) తొమ్మిదేళ్లలో తొలిసారిగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం, దేశీ కరెన్సీ రూపాయి సోమవారం డాలర్‌ మారకంలో 21 పైసలు నష్టపోయి 71.21కి పతనం కావడం, ఇండియన్‌ గవర్నమెంట్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ సోమవారం నాలుగేళ్ల గరిష్ట స్థాయి 8 శాతానికి సమీపంలో ఉండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, టైటాన్‌, విప్రో, టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక అదానీ పోర్ట్స్‌, వేదాంత, హిందుస్తాన్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ యూనిలివర్‌, హిందాల్కో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, ఐటీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
ఒక్క ఐటీ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. 
 



You may be interested

కొత్త కనిష్టానికి రూపాయి

Tuesday 4th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి పతనమైంది. వాణిజ్య ఉద్రిక్తతల భయాల వల్ల వర్ధమాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, అర్జెంటీనా సహా టర్కీలో సంక్షోభాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.34 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 71.21తో పోలిస్తే 0.19 శాతం క్షీణించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 4th September 2018

నిప్టీ సోమవారం పాజిటివ్‌గానే ప్రారంభమైంది. అయితే అదే ట్రెండ్‌ను కొనసాగించలేకపోయింది. ఇండెక్స్‌ తన కీలక మద్దతు స్థాయి 11,600కు దిగువకు వచ్చేసింది. డైలీ చార్ట్స్‌లో బేర్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి కనిపిస్తోంది. ఇండెక్స్‌ 13 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ వద్ద మద్దతు తీసుకుంది. 11,582 పాయింట్ల వద్ద ముగిసింది. మునపటి ముగింపుతో పోలిస్తే దాదాపు 1 శాతం క్షీణించింది. సమీప

Most from this category