STOCKS

News


జోరు మీదున్న మార్కెట్లు

Monday 27th August 2018
Markets_main1535343371.png-19657

మార్కెట్‌ జోరు తగ్గడం లేదు. ఇండెక్స్‌లు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం పడిపోయిన స్టాక్‌ మార్కెట్‌ సోమవారం తిరిగి మళ్లీ లాభాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,251 పాయింట్లతో పోలిస్తే 221 పాయింట్ల లాభంతో 38,472 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,557 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,605 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 
అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగియడం, ఎస్‌అండ్‌పీ 500 సహా నాస్‌డాక్‌ ఇండెక్స్‌ కొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాల్లోనే ట్రేడవుతుండటం, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గ్యాప్‌అప్‌ను సూచిస్తుండటం, ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ రేట్ల పెంపు కొనసాగుతుందని సంకేతాలివ్వడం, దేశీయ విదేశీ మారక నిల్వలు ఆగస్టు 17తో ముగిసిన వారంలో 33.2 మిలియన్ డాలర్ల మేర తగ్గి 400.847 బిలియన్ డాలర్లకు పడివడం, విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్ట్‌ నెలలో ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లోకి రూ.6,700 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయడం, రూపాయి శుక్రవారం రికవరీ అయ్యి అమెరికా డాలర్‌తో పోలిస్తే 20 పైసలు బలపడి 69.91 వద్ద ముగియడం, సెక్యూరిటీస్‌ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌ (ఎస్‌ఎల్‌బీ) సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగిస్తున్నామని సెబీ పేర్కొనడం, ఆఫ్‌షోర్‌ ఇండియా ఫండ్స్‌ సహా ఈటీఎఫ్‌ల నుంచి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలో ఏకంగా 2 బిలియన్‌ డాలర్లు వెనక్కు వెళ్లాయని మార్నింగ్‌స్టార్‌ నివేదిక పేర్కొనడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యస్‌ బ్యాంక్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, విప్రో షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పెరిగాయి. 
 



You may be interested

రూపాయి: 15 పైసలు లాభం

Monday 27th August 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం ఉదయం బలపడింది. తన మునపటి ముగింపు 69.91తో పోలిస్తే 15 పైసలు లాభంతో 69.76 వద్ద ప్రారంభమైంది.  శుక్రవారం కూడా రూపాయి రికవరీ అయ్యింది. అమెరికా డాలర్‌ క్షీణించడం ఇందకు కారణం. ఇటీవల కాలంలో రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు కారణం.  డాలర్‌ బలపడటం ప్రధాన అంశం. దీనివల్ల రూపాయి సహా వర్ధమాన దేశాల

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 27th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జెనీసెస్‌ కలర్స్‌లో అదనంగా 3.07శాతం వాటాను రూ.8.32కోట్లను కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుతో జెనీసెస్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మొత్తం వాటాను 49.46శాతానికి పెంచుకుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో ఎన్‌సీడీల జారీ ఇష్యూ ద్వారా రూ.1000 కోట్లను, గ్రీన్‌షూ​ఆప్షన్‌ పద్దతి ద్వారా మరో రూ.1000 కోట్లను మొత్తం 2వేల కోట్ల సమీకరణకు బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఫోర్టిస్‌

Most from this category