STOCKS

News


ఫ్లాట్‌ ఓపెనింగ్‌.. వెంటనే నష్టాల్లోకి..

Monday 1st October 2018
Markets_main1538366480.png-20725

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,227 పాయింట్లతో పోలిస్తే 47 పాయింట్ల లాభంతో 36,274 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,930 పాయింట్లతో పోలిస్తే అక్కడే స్థిరంగా 10,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టా‍ల్లోకి జారిపోయాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్‌ 133 పాయింట్ల నష్టంతో 36,093 వద్ద, నిఫ్టీ 47 పాయిం‍ట్ల నష్టంతో 10,882 వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగియడం, ఒక్క దక్షిణ కొరియా ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతుండటం (చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లకు సెలవు), బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర సోమవారం 0.4 శాతం వృద్ధితో నాలుగేళ్ల గరిష్ట స్థాయికి దగ్గరిగా బ్యారెల్‌కు 83.04 డాలర్లకు పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం 11 పైసలు బలపడి 72.48 వద్ద ముగియడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం సహా రూపాయి క్షీణత వంటి అంశాల వల్ల ఇండియన్‌ ఎగుమతులు పెరుగుతాయని అసోచామ్‌ పేర్కొనడం, విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి సెప్టెంబర్‌ నెలలో ఏకంగా రూ.21,000 కోట్లమేర నిధులను వెనక్కు తీసుకెళ్లడం (ఈ స్థాయిలో నిధులను ఉపసంహరించుకోవడం గత నాలుగు నెలల్లో ఇదే అధికం), చైనా నవంబర్‌ 1 నుంచి టైక్స్‌టైల్‌ ప్రొడక్ట్స్‌ సహా మెటల్స్‌ దిగుమతులపై సుంకాలను 11.5 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గించనుండటం, ఎన్‌ఎస్‌ఈ అక్టోబర్‌ 12 నుంచి/బీఎస్‌ఈ అక్టోబర్‌ 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్‌ను ప్రారంభించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో టీసీఎస్‌, గెయిల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఐషర్‌ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఐటీ మినహా మిగతావన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పడిపోయాయి. You may be interested

బంధన్‌ బ్యాంక్‌ 20 శాతం క్రాష్‌

Monday 1st October 2018

ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ షేరు సోమవారం మార్కెట్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. స్టాక్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌లోకి వెళ్లింది. దాదాపు 4,91,723 షేర్ల సెల్‌ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కొనేవాళ్లు లేరు. బంధన్‌ బ్యాంక్‌ షేరు ధర ఎస్‌ఎస్‌ఈలో 20 శాతం క్షీణతతో రూ.452కు పడిపోయింది.   లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ శుక్రవారం కఠిన చర్యలకు దిగింది.

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 1st October 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌:- నాన్ కన్వర్టబుల్ డెట్ ఇష్యూ ద్వారా రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థ ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:-  ప్రముఖ రేటింగ్‌ను సంస్థ ఇండియా రేటింగ్స్‌...  కంపెనీ జారీ చేసిన రూ.310 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు రేటింగ్‌ను తగ్గించింది. కరూర్‌వైశ్యా బ్యాంక్‌:- నియమనిబంధనలను ఉల్లఘించినందుకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.5కోట్ల జరిమానాను

Most from this category