STOCKS

News


10,600 పైకి నిఫ్టీ

Tuesday 16th October 2018
Markets_main1539667277.png-21194

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు జోరుమీదున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్‌ పైకి వెళ్లింది. ఇక సెన్సెక్స్‌ 35,200 మార్క్‌కు పైకి వచ్చింది. ఉదయం 10:42 సమయంలో నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10,595 వద్ద, సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 35,183 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 34,913 కనిష్ట, 35,215 గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 10,525 కనిష్ట స్థాయిని, 10,695 గరిష్ట స్థాయిని తాకింది. వివిధ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఇండెక్స్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 
నిఫ్టీ-50లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు 3 శాతానికిపైగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అదేసమయంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 2 శాతానికిపైగా పడిపోయింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా, విప్రో షేర్లు దాదాపుగా 1 శాతం నష్టపోయాయి. 
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క ఐటీ మాత్రం నష్టాల్లో ఉంది. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పెరిగాయి. 

కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,865 పాయింట్లతో పోలిస్తే 139 పాయింట్ల లాభంతో 35,004 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,512 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 10,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  



You may be interested

స్థిరంగా పసిడి ధర

Tuesday 16th October 2018

ప్రపంచమార్కెట్లో మం‍గళవారం పసిడి ధర రెండున్నర నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి అరడాలర్‌ పెరిగి లాభపడి 1,229 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళనలతో పాటు, సౌదీ అరేబియా, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 1,236.90 స్థాయిని

టాటామోటర్స్‌ నిర్ణయంతో షాకయ్యాం!

Tuesday 16th October 2018

జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలగాలన్న టాటామోటర్స్‌ నిర్ణయం తొలుత తమకు షాక్‌ కలిగించిందని టాటా హిటాచీ సీనియర్‌ డైరెక్టర్‌ షిన్‌ నకజిమా చెప్పారు. టాటాల నుంచి అలాంటి అనూహ్య నిర్ణయాన్ని తాము ఊహించలేదన్నారు. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జేవీ వాటా విక్రయం, రూపీ క్షీణత, యెన్‌ మారకం తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలివీ... ప్ర: టాటా హిటాచీ జాయింట్‌ వెంచర్‌లో

Most from this category