STOCKS

News


సెన్సెక్స్‌ @ 38,000

Thursday 9th August 2018
Markets_main1533787318.png-19059

బుల్‌ రంకెలేస్తోంది. స్టాక్‌ మార్కెట్‌ గురువారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తొలిసారి 38,000 మార్క్‌ను తాకింది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,888 పాయింట్లతో పోలిస్తే 107 పాయింట్ల లాభంతో 37,995 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. వెంటనే 38,050 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,450 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,493 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్లు బుధవారం కూడా సరికొత్త రికార్డ్‌ స్థాయిల వద్ద ఆరంభమయ్యాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్పంగా తగ్గడం, అమెరికా- చైనా మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఆసియా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతుండటం, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 16 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రొడక్టులపై చైనా అదనంగా 25 శాతం టారిఫ్‌లను విధించడం, ముడి చమురు ధరలు బుధవారం క్షీణించడం, ఇండియాలో 2014-15 నుంచి 2017-18 ఆర్థిక సంవతవ్సరాల్లో తలసరి ఆదాయం సగటున చూస్తే పెరగడం, ఉపాధి కల్పన తగ్గుదల, వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌కు సీసీఐ ఆమోదం, ఆర్‌బీఐ దాదాపు రూ.50,000 కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి అందించడం, రూపాయి బుధవారం 5 పైసలు బలపడి 68.63కు పెరగడం, క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీవో తొలి రోజు 25 శాతం సబ్‌స్క్రైబ్‌ అవ్వడం, 241 కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మారెర్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, సిప్లా, హిందుస్తాన్‌ పెట్రోలియం, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, బీపీసీఎల్‌, ఐఓసీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌, టైటాన్‌, మారుతీ సజుకీ, ఓఎన్‌జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మీడియా మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 
 You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 9th August 2018

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు సేలన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌:- ప్రతి షేరు ధర రూ.415.50ల వద్ద డాలీ ఖన్నా 1.50లక్షల ఈక్విటీ షేర్లును కోనుగోలు చేశారు. సన్‌టెక్స్‌ రియల్టీ:- ప్రతి షేరు ధర రూ.415.50ల వద్ద డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సం‍స్థ 10లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. వింధ్యా టెలిలింక్‌:- ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతి షేరు ధర రూ.1,333.28ల వద్ద మొత్తం

మార్కెట్లపై వీటి ప్రభావం

Thursday 9th August 2018

రెండు రోజులుగా కన్సాలిడేట్‌ అవుతూ వస్తున్న నిఫ్టీ ఇండెక్స్‌ని బుల్స్‌ బుధవారం 11,460 స్థాయికి తీసుకెళ్లాయి. ఇండెక్స్‌ కీలకమైన నిరోధ స్థాయిలకు సమీపంలో కదలాడుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వరుసగా రెండు సెషన్‌లలో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరచిన ఇండెక్స్‌ బుధవారం డైలీ చార్ట్స్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇండెక్స్‌కు 11,500, 11,530 వద్ద కీలకమైన నిరోధ స్థాయి ఉంది. ఇక 11,330 మద్దతు స్థాయి.   నిఫ్టీ 50 బుధవారం

Most from this category