STOCKS

News


లాభాలతో ఆరంభం

Wednesday 12th September 2018
Markets_main1536725486.png-20176

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,413 పాయింట్లతో పోలిస్తే 133 పాయింట్ల లాభంతో 37,546 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,287 పాయింట్లతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 11,340 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు వెంటనే ఆవిరయ్యాయి. ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. అయితే మళ్లీ సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చాయి. 

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లోనే ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం రికార్డ్‌ కనిష్ట స్థాయి 72.69 వద్ద ముగియడం, ఇరాన్‌పై ఆంక్షలు సహా అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు తగ్గడం వల్ల క్రూడ్‌ ధరలు బుధవారం పెరగడం, ఆర్‌బీఐ జూలైలో 1.87 బిలియన్‌ డాలర్లను విక్రయించడం, అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగితే చైనా 7 లక్షల ఉద్యోగాల కోల్పోవలసి వస్తుందని జేపీ మోర్గాన్‌ పేర్కొనడం, చైనా కంపెనీలు అమెరికా టారిఫ్‌లను తప్పించుకోవడానికి చైనా నుంచి ఇతర దేశాలను కార్యకలాపాలను మళ్లీస్తుండటం, వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ, హిందుస్తాన్‌ యూనిలివర్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, ఇండియాబుల్స్‌  హౌసింగ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక ఐఓసీ, హిందుస్తాన్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, టైటాన్‌, లుపిన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.  



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా:- యూఎస్‌ఎఫ్‌డీఏ పంబాజ్‌లోని మొహాలీ ప్లాంట్‌ను రెండురోజుల(సెప్టెంబర్‌ 10, 11) పాటు తనిఖీలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సిన్జిన్ ఇంటర్నేషన్‌:- బయోకాన్‌ కంపెనీ తన మొత్తం వాటాలో నుంచి అరశాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను సోమవారం ఓపెన్‌మార్కెట్‌ ద్వారా విక్రయించింది. సిప్లా:- హెచ్‌ఐవీ వ్యాధి చికిత్సలో వినియోగించే ట్రిపుల్‌ కాంబినేషన్‌ ఆప్‌ యాంటిరెట్రోవైరల్‌ ఔషధానికి ఎస్‌ఎహెచ్‌పీఆర్‌ఏ(సౌత్‌ ఆఫ్రికన్‌ హెల్త్‌ ప్రోడక్ట్స్‌

మార్కెట్‌ ఎటు?

Wednesday 12th September 2018

మంగళవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది.  నష్టాల్లోకి జారిపోయింది. 11,300 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పతనం కావడం, వాణిజ్య ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి.  ఇండెక్స్‌ తన డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌లో పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. ఇది బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరి కనిపిస్తోంది. 11,476 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 11,479 పాయింట్లను

Most from this category