STOCKS

News


10,700 పైన నిఫ్టీ

Monday 19th November 2018
Markets_main1542600005.png-22157

  • గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన సెన్సెక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,682 పాయింట్లతో పోలిస్తే 49 పాయింట్ల లాభంతో 10,731 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,457 పాయింట్లతో పోలిస్తే 190 పాయింట్ల లాభంతో 35,647 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది.

కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుండటం, అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో వ్యాపార భాగస్వామ్యానికి ముగింపు పలకాలని బీఎస్‌ఈ నిర్ణయించడం, ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియం ఒత్తిడి తీసుకురావొచ్చనే అంచనాల వల్ల క్రూడ్‌ ధరలు సోమవారం పెరగడం, రూపాయి నవంబర్‌ 16న 4 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.93 వద్ద ముగియడం, ఫారెక్స్‌ నిల్వలు నవంబర్‌ 9తో ముగిసిన వారంలో 121 మిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 393.01 బిలియన్‌ డాలర్లకు తగ్గడం, ఇండియన్‌ క్యాపిట్‌ మార్కెట్‌లోకి పి-నోట్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లు అక్టోబర్‌ చివరి కల్లా 9 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్‌ఈ షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని చూస్తుండటం, రూపాయి రికవరీ సహా క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో ఎఫ్‌ఫీఐలు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లో నవంబర్‌లో ఇప్పటి దాకా రూ.8,285 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు ప్రస్తుత క్యూ2లో 3.5 రెట్లుకుపైగా పెరగడం, సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌.. తైవాన్‌ ఇండెక్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం లాభాల్లో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగియడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనాతో వాణిజ్య పరమైన డీల్‌ కుదరచ్చని ఆశాభావం వ్యక్తంచేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో యస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హీరో మోటొకార్ప్‌, ఇన్ఫోసిస్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, గెయిల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  భారతీ ఎయిర్‌టెల్‌ 3 శాతం క్షీణించింది. యస్‌ బ్యాంక్‌ 3 శాతానికిపైగా పెరిగింది. 

ఒక్క నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ 1 శాతానికిపైగా పెరిగింది. 



You may be interested

స్వల్ప నష్టాల్లో రూపీ

Monday 19th November 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. నేడు జరగనున్న రిజర్వు బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.11 శాతం క్షీణతతో 72 వద్ద ట్రేడవుతోంది. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 71.93గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి సోమవారం అమెరికా

మార్కెట్‌ ఎటు?

Monday 19th November 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:53 సమయంలో 49 పాయింట్ల లాభంతో 10,747 పాయింట్ల వద్ద ఉంది.  ♦ కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా

Most from this category