STOCKS

News


గ్యాప్‌డౌన్‌ ప్రారంభం

Thursday 4th October 2018
Markets_main1538625241.png-20832

  • సెన్సెక్స్‌ 500 పాయింట్లు క్రాష్‌
  • నిఫ్టీ 160 పాయింట్ల డౌన్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,975 పాయింట్లతో పోలిస్తే 155 పాయింట్ల నష్టంతో 35,820 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,858 పాయింట్లతో పోలిస్తే 104 పాయింట్ల నష్టంతో 10,754 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్షణాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాలు భారీగా పెరిగాయి. ఉదయం 9:18 సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 503 పాయింట్ల 35,472 వద్ద, నిఫ్టీ 162 పాయిం‍ట్ల నష్టంతో 10,695 వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో క్లోజవ్వడం, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ వరుసగా రెండో రోజు కూడా రికార్డ్‌ స్థాయి వద్ద ముగియడం, అమెరికాలో పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయి 3.179 శాతానికి.. రెండేళ్ల ఈల్డ్స్‌ దశాబ్ద కాల గరిష్టానికి ఎగయడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతుండటం (చైనా మార్కెట్‌కు సెలవు), ఇండియన్‌ రూపాయి బుధవారం 73 మార్క్‌ దిగువకు పతనమై.. అమెరికా డాలర్‌తో పోలిస్తే 43 పైసలు క్షీణతతో 73.34 వద్ద ముగియడం, క్రూడ్‌ ధరలు గురువారం తగ్గడం, యెన్‌ సహా ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్‌ 11 నెలల గరిష్ట స్థాయికి చేరడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు కొనసాగుతుందని ఫెడరల్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ పేర్కొన్నడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో ఎల్‌అండ్‌టీ, హిందాల్కో షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, హీరో మోటొకార్ప్‌, ఎంఅండ్‌ఎం, కోల్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పడిపోయాయి. 



You may be interested

రూపీ @ 73.77

Thursday 4th October 2018

ఇండియన్‌ రూపాయి గురువారం కొత్త కనిష్ట స్థాయిలకు పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 73.67 వద్ద ప్రారంభమైంది. రూపాయి బుధవారం 43 పైసలు క్షీణించి 73.34 వద్ద ముగిసింది. రూపాయి సోమవారం ముగింపు 72.91గా ఉంది. క్రూడ్‌ ధరలు 85 మార్క్‌పైకి చేరుకోవడంతో బుధవారం రూపాయి ఒకానొక సమయంలో 73.42 స్థాయికి కూడా పడిపోయింది.    ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.68 వద్ద ట్రేడవుతోంది. మునపటి

మార్కెట్‌ ఎటు?

Thursday 4th October 2018

గురువారం స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ వరుసగా రెండో రోజు కూడా రికార్డ్‌ స్థాయి వద్ద ముగిసింది. మిగతా నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు కూడా బుధవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 54 పాయిం‍ట్ల లాభంతో 26,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట ముగింపు స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 2,925 పాయింట్ల

Most from this category