STOCKS

News


10,600 దిగువకు నిఫ్టీ

Wednesday 26th December 2018
Markets_main1545797255.png-23231

  • సెన్సెక్స్‌ 280 పాయింట్లు డౌన్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,663 పాయింట్లతో పోలిస్తే 28 పాయింట్ల నష్టంతో 10,635 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,470 పాయింట్లతో పోలిస్తే 27 పాయింట్ల నష్టంతో 35,443 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచేకొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌ 280 పాయింట్ల నష్టంతో 35,189 వద్ద, నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో 10,583 వద్ద ట్రేడవుతున్నాయి.  

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా (హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌కు సెలవు) ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు సోమవారం భారీగా పతనమవ్వడం, అమెరికా-మెక్సికో బార్డర్‌కు నిధుల లభించేంత వరకు ప్రభుత్వ పాక్షిక మూసివేత కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేయడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు సోమవారం 6 శాతానికి పైగా పతనమవ్వడం, 2.08 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో భారత్‌ ప్రపంచంలో ఏడో అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా అవతరించడం, ఏప్రిల్‌-నవంబర్‌ మధ్యకాలంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.280 కోట్లను వెనక్కు తీసుకోవడం, శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ ఐపీవోకు వచ్చేందుకు రెడీ అవుతుండటం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభ ఉద్దంతంలో ఆడిటర్ల పాత్రపై సెబీ దర్యాప్తు చేయనుందనే అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 


నిఫ్టీ-50లో హెచ్‌పీసీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, విప్రో, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. సన్‌ ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, విప్రో షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 

ఒక్క నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. 



You may be interested

క్రూడ్‌, డాలర్‌ డౌన్‌.. రూపీ అప్‌..

Wednesday 26th December 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం లాభాలతో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.88 వద్ద ఆరంభమైంది. రూపాయి సోమవారం ముగింపు స్థాయి 70.13గా ఉంది. కాగా మంగళవారం క్రిస్మస్‌ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు.  క్రూడ్‌ ధరలు పతనం కావడం మన కరెన్సీకి కలిసొచ్చింది. అలాగే అమెరికాలో రాజకీయ అస్థిరతల వల్ల డాలర్‌పై ఒత్తిడి నెలకొంది. దీంతో రూపాయికి బలం చేకూరింది. క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 55 డాలర్ల దిగువునే ట్రేడ్‌ అయితే..

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 26th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వేదాంత లిమిటెడ్‌:- జార్ఖండ్‌లో కొత్త యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమైనట్లు కంపెనీ తెలిపింది. సుమారు 3-4 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌కు ఏడాదికి 3-4 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. అలాగే ప్లాంట్‌ ద్వారా ప్రత్యక్షంగానీ, పరోక్షంగా 1.20లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు.   నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌:-

Most from this category