STOCKS

News


ట్రెండ్‌ రివర్స్‌: మార్కెట్‌ డౌన్‌

Friday 21st September 2018
Markets_main1537515264.png-20439

గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నాం వరకు అదే జోరును కొనసాగించాయి. అయితే తర్వాత ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. మధ్యాహ్నాం 1:12 సమయంలో సెన్సెక్స్‌ 248 పాయింట్ల నష్టంతో 36,872 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 149 పాయింట్ల నష్టంతో 11,085 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ మళ్లీ 11,200 మద్దతు స్థాయి దిగువకు పతనమైంది.  

ఇక నిఫ్టీ-50లో ఐఓసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికిపైగా.. ఐటీసీ, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఏసియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. అదేసమయంలో యస్‌ బ్యాంక్‌ 24 శాతానికిపైగా పతనమైంది. ఇక ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 17 శాతంమేర క్షీణించింది. ఇక బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు 5 శాతానికిపైగా పడిపోయాయి. ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌ షేర్లు 2 శాతానికిపైగా క్షీణించాయి. ఇక సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు 1 శాతానికిపైగా తగ్గాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ 5 శాతానికిపైగా, నిఫ్టీ ఫార్మా 2 శాతానికిపైగా, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ 1 శాతానికిపైగా క్షీణించాయి. 

శుక్రవారం సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,121 పాయింట్లతో పోలిస్తే 157 పాయింట్ల లాభంతో 37,278 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,234 పాయింట్లతో పోలిస్తే 37 పాయింట్ల లాభంతో 11,271 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 



You may be interested

సెన్సెక్స్‌ 1500 పాయింట్లు క్రాష్‌

Friday 21st September 2018

11,000 దిగువకు నిఫ్టీ స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా రెప్పపాటు కాలంలో భారీగా పతనమైంది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఒకానొక సమయంలో ఏకంగా 1496 పాయింట్లమేర క్షీణించింది. 37,489 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే 35,993 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత ఇండెక్స్‌లు కొంత కోలుకున్నాయి. మధ్యాహ్నాం 1:24 సమయంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో 36,806 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కన్నా ఐసీఐసీఐ బెటర్‌!

Friday 21st September 2018

దేవాంగ్‌ మెహతా వచ్చే 6- 9 నెలల కాలానికి వాల్యూషన్ల పరంగా, వృద్ధి పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు కన్నా ఐసీఐసీఐబ్యాంకు షేరు బాగుందని సెంట్రమ్‌ ఇండియా అనలిస్టు దేవాంగ్‌ మెహతా అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్‌లో ఇన్వెస్టర్ల దృష్టి క్రమంగా ఐసీఐసీఐ బ్యాంకు వైపునకు మరులుతుందన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కౌంటర్లో రద్దీ ఎక్కువని, అందువల్ల కొందరు ఇన్వెస్టర్లు క్రమంగా వ్యూహాత్మకంగా ఐసీఐసీఐ బ్యాంకు కౌంటర్‌కు మరలిపోతారని చెప్పారు. ఐసీఐసీఐ పద్దు పుస్తకాల

Most from this category