STOCKS

News


పాజిటివ్‌ ఓపెనింగ్‌.. లాభాల్లో మార్కెట్‌

Wednesday 12th December 2018
Markets_main1544587230.png-22835

  • 10,600 పైన నిఫ్టీ
  • సెన్సెక్స్‌ 200 పాయింట్లు జంప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,549 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్ల లాభంతో 10,591 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,150 పాయింట్లతో పోలిస్తే 127 పాయింట్ల లాభంతో 35,277 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ లాభాలు కూడా పెరిగాయి. ఉదయం 9:22 సమయంలో సెన్సెక్స్‌ 210 పాయింట్ల లాభంతో 35,359 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 10,615 వద్ద ట్రేడవుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ను నియమించడం, క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగడం, వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ డిసెంబర్‌ 13న ఓపెన్‌ మార్కెట్‌లో రూ.10,000 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయనుండటం, ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 11న అమెరికా డాలర్‌తో పోలిస్తే 53 పైసలు క్షీణించి 71.85 వద్ద ముగియడం, ఆర్‌బీఐ అక్టోబర్‌లో 7.2 బిలియన్‌ డాలర్లను విక్రయించడం, ఇండియన్‌ కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నవంబర్‌లో 35 శాతం క్షీణతతో 1.05 బిలియన్‌ డాలర్లకు తగ్గడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాలతో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగియడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, యూపీఎల్‌, హీరో మోటొకార్ప్‌, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, ఏసియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు దాదాపు 1 శాతం క్షీణించాయి. ఇక ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4 శాతానికి పైగా పెరిగింది. యస్‌ బ్యాంక్‌ 3 శాతానికి పైగా లాభపడింది. టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటొకార్ప్‌ షేర్లు 2 శాతానికి పైగా ఎగశాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా ఎగసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి. 



You may be interested

రూపీ మళ్లీ తగ్గింది..

Wednesday 12th December 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం మళ్లీ బలహీనపడింది. మూడు ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికార బీజేపీ ఓడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ నియామకం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఉదయం 9:15 సమయంలో రూపాయి 72.10 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు స్థాయి 71.87తో పోలిస్తే 0.33 శాతం క్షీణించింది. ఇకపోతే రూపాయి బుధవారం 72.02 వద్ద ప్రారంభమైంది.  భారత్‌లో పదేళ్ల

మార్కెట్‌ ఎటువైపు?

Wednesday 12th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 25 పాయింట్ల నష్టంతో 10,574 పాయింట్ల వద్ద ఉంది.  ♦కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ను నియమించింది.  ♦క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర ఒక శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 52.15 డాలర్ల వద్ద ఉంది. ♦వ్యవస్థలో లిక్విడిటీని

Most from this category