STOCKS

News


మార్కెట్ల యూటర్న్‌

Monday 12th November 2018
Markets_main1542001660.png-21895

  • 10,600 మార్క్‌ దిగువున నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11:11 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 35,129 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 10,583 వద్ద ట్రేడవుతున్నాయి. 
నిఫ్టీ-50లో టెక్‌ మహీంద్రా, టైటాన్‌ షేర్లు 3 శాతానికిపైగా పెరిగాయి. ఇక ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 2 శాతానికిపైగా లాభపడ్డాయి. రూపాయి క్షీణత వల్ల ఐటీ స్టాక్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఇక హిందుస్తాన్‌ పెట్రోలియం షేరు 4 శాతానికిపైగా పతనమైంది. అలాగే టాటా మోటార్స్‌ 3 శాతానికిపైగా పడిపోయింది. హిందాల్కో 2 శాతానికిపైగా నష్టపోయింది.  
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. నిఫ్టీ ఐటీ 1 శాతానికిపైగా పెరిగింది. 

కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,585 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,607 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,158 పాయింట్లతో పోలిస్తే 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  



You may be interested

రూపాయి డీలా : ఐటీ ర్యాలీ

Monday 12th November 2018

డాలర్‌ మారకంలో రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం ర్యాలీ చేసింది. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా నేడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనపడింది. ఫలితంగా డాలర్‌ రూపంలో ఆదాయాల్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లు లాభాల ర్యాలీ చేస్తున్నాయి. నేటి ఇంట్రాడేలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ

నెల కనిష్టం వద్ద నిలకడగా పసిడి ధర

Monday 12th November 2018

ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నెల కనిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.30లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1.00 డాలరు స్వల్పలాభంతో 1209.6 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  డిసెంబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ కీలకవడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రాత్రి నెలరోజుల కనిష్టానికి పతనమైన సంగతి

Most from this category