STOCKS

News


మార్కెట్‌కు రూపీ పోటు..సెన్సెక్స్‌ 300 పాయింట్లు డౌన్‌

Monday 10th September 2018
Markets_main1536561989.png-20126

నెగటివ్‌లో ప్రారంభమైన మార్కెట్లు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే ఇండెక్స్‌ల నష్టాలు బాగా పెరిగాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా పడిపోతే.. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పతనమైంది. మధ్యాహ్నం 12:02 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 38,061 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 11,482 వద్ద ట్రేడవుతున్నాయి. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 72.57కి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. రూపాయి ఒక్క రోజులో ఏకంగా 1.1 శాతం లేదా 81 పైసలు క్షీణించింది. 

హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, సిప్లా, విప్రో టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌ షేర్ల లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ-50లో 40 స్టాక్స్‌ నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 షేర్లలో 7 షేర్లు మినహా మిగతావన్నీ నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 30లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, వేదాంత, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రెండు శాతం మేర పడిపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 1 శాతం పెరిగింది. ఇక నిఫ్టీ-50లో బజాజ్‌ ఫైనాన్స్‌ 3 శాతానికి పైగా తగ్గితే.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు రెండు శాతానికిపైగా నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో ఒక్క ఐటీ మినహా మిగతావన్నీ నష్టపోయాయి. దాదాపు అన్నీ అటుఇటుగా 1 శాతంమేర పడిపోయాయి. 



You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌... ఆల్‌టైమ్‌ హై

Monday 10th September 2018

ముంబై:- కొత్త ఛైర్మన్‌గా అమితాబ్ చౌదరి నియామకం ఖరారు కావడంతో యాక్సిస్ బ్యాంకు షేరు సోమవారం ఆల్‌టైం హైని తాకింది. నేడు బీఎస్‌ఈలో యాక్సి్‌స్‌ బ్యాంకు షేరు రూ.645.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో శిఖా శర్మ స్థానంలో అమితాబ్ చౌదరిని నియమిస్తున్నట్లు శనివారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్నట్టు యాక్సిస్‌ బ్యాంకు ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో నేటి ఇంట్రాడే షేరు ఏకంగా 5శాతం లాభపడి

బేర్‌మంటున్న బ్యాంకింగ్‌ షేర్లు

Monday 10th September 2018

ముంబై:- అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు, రూపాయి కొత్త కనిష్టాలకు క్షీణత తోడవ్వడంతో సోమవారం మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(0.50శాతం లాభం) తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 27,395.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభంమైంది. మార్కెట్‌ పతనంలో భాగంగా 1శాతం(271 పాయింట్లు నష్టపోయి 27210 వద్దకు పతనమైంది. ఈ

Most from this category