STOCKS

News


లాభాల బోణి

Monday 12th November 2018
Markets_main1541994813.png-21879

  • 10,600 మార్క్‌కు పైన నిఫ్టీ
  • సెన్సెక్స్‌ 130 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,585 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,607 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,158 పాయింట్లతో పోలిస్తే 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధర తగ్గడం సహా చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆందోళనల కారణంగా అమెరికా స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం భారీగా నష్టపోవడం, అమెరికాతో వాణిజ్య చర్చలకు చైనా తలుపులు తెరవడం, దేశీ ఫారెక్స్‌ నిల్వలు నవంబర్‌ 2తో ముగిసిన వారంలో 1.05 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 393.13 బిలియన్‌ డాలర్లకు పెరగడం, డిసెంబర్‌ క్రూడ్‌ సరఫరాలో కోత ఉండొచ్చని సౌదీ అరేబియా ప్రకటించడంతో క్రూడ్‌ ధర సోమవారం 1 శాతంమేర పెరిగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 9న 50 పైసలు బలపడి 72.50 వద్ద ముగియడం, విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు రూ.4,800 కోట్ల మేర నిధులను ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, దాదాపు 371 కంపెనీలు సోమవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, మారుతీ సుజకీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. హిందుస్తాన్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌, ఐఓసీ, ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హీరో మోటొకార్ప్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హిందుస్తాన్‌ పెట్రోలియం షేరు 2 శాతానికిపైగా పడిపోతే, టైటాన్‌ షేరు 2 శాతంమేర పెరిగింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 



You may be interested

రూపాయి క్షీణత..

Monday 12th November 2018

ఇండియన్‌ రూపాయి బలహీనపడింది. కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణంకాల వెల్లడి నేపథ్యంలో సోమవారం రూపాయి నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తన మునపటి (శుక్రవారం) ముగింపుతో పోలిస్తే 0.33 శాతం క్షీణతతో 72.74 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 72.50గా ఉంది. ఇక రూపాయి సోమవారం 72.68 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.787

మార్కెట్‌ ఎటు?

Monday 12th November 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,070 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 14 పాయిం‍ట్ల లాభంతో 9,844 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల లాభంతో 2,606 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల నష్టంతో 2,082

Most from this category