STOCKS

News


లాభాలు కొన్ని క్షణాలే..

Tuesday 25th September 2018
Markets_main1537848253.png-20534

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,305 పాయింట్లతో పోలిస్తే 45 పాయింట్ల లాభంతో 36,350 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,967 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్ల స్వల్ప లాభంతో 10,969 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:26 సమయంలో సెన్సెక్స్‌ 41 పాయింట్ల నష్టంతో 36,264 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 10,934 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగియడం, ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం లాభాల్లో ట్రేడవుతుండటం (దక్షిణ కొరియా, హాంగ్‌ కాంగ్‌ మార్కెట్లకు సెలవు), ఉత్తర కొరియాతో రెండోసారి సమావేశం త్వరలో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొనడం, బోఫా-ఎంఎల్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ క్యాడ్‌ 2.8 శాతానికి పెరగొచ్చని అంచనా వేయడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అమెరికా ఇన్వెంటరీల్లో నిల్వలు కనిష్ట స్థాయిల్లో ఉండటం సహా ఒపెక్‌, రష్యా దేశాలు ఉత్పత్తిని పెంచడానికి విముఖత వ్యక్తంచేయడం వల్ల క్రూడ్‌ ధరలు మంగళవారం పెరగడం, బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 81.39 డాలర్లకు చేరడం, రిజర్వు బ్యాంక్‌ సెప్టెంబర్‌ 27న ఓపెన్‌ మార్కెట్‌లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుండటం, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో భేటీ కానుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 43 పైసలు క్షీణించి 72.63 వద్ద ముగియడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో యస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, లుపిన్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఒక్క నిఫ్టీ ఫార్మా మినహా మిగతావన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ రియల్టీ గరిష్టంగా 2 శాతానికిపైగా పడిపోయింది.You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 25th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కజారియా కెమికల్స్‌:- తన అనుబంధ సంస్థ కజారియా ఫ్లోరోకెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 30లక్షల ఈక్విటీ షేర్లను రూ.7.20 కోట్లకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. యూనికెమ్‌ ల్యాబ్స్‌:- రేటింగ్‌ సంస్థ ఇక్రా... యూనికెమ్‌ ల్యాబ్స్‌కు చెందిన రూ.30కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌కు ఎ(+) స్టేబుల్‌ అవుట్‌ లుక్‌ రేటింగ్‌ను కేటాయించింది. వక్రంగీ:- మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేట్‌ ఎఫైర్స్‌ శాఖ నుంచి ఎలాంటి

మార్కెట్‌పై వీటి ప్రభావం...

Tuesday 25th September 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 181 పాయిం‍ట్ల నష్టంతో 26,562 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 10 పాయింట్లు నష్టంతో 2,919 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 6 పాయింట్ల లాభంతో 7,993 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా-చైనా కొత్త టారిఫ్‌లు సోమవారం నుంచి అమల్లోకి రావడం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే

Most from this category