STOCKS

News


లాభాల్లోంచి నష్టాల్లోకి.. మళ్లీ లాభాల్లోకి..

Friday 31st August 2018
Markets_main1535688332.png-19812

గురువారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,690 పాయింట్లతో పోలిస్తే 14 పాయింట్ల లాభంతో 38,704 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,677 పాయింట్లతో పోలిస్తే 1 పాయింటు స్వల్ప నష్టంతో 11,676 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారిపోయింది. ఇక నిఫ్టీ నష్టాలు మరింత పెరిగాయి. ఉదయం 9:20 సమయంలో సెస్సెక్స్‌ 34 పాయింట్ల నష్టంతో 38,659 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 11,673 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ఉదయం 9:32 సమయంలో మళ్లీ ఇండెక్స్‌లు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్‌ 112 పాయింట్ల లాభంతో 38,802 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 11,718 వద్ద ట్రేడవుతున్నాయి. 

వాణిజ్య ఉద్రిక్తతల భయాలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం సహా లేబర్‌ డే హాలిడే వారం నేపథ్యంలో ఇన్వెస్టర్లు విక్రయాలవైపు మొగ్గుచూపడం వల్ల గత నాలుగు సెషన్లలో ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగియడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇక బీజింగ్‌తో ట్రేడ్‌వార్‌కు సిద్ధమౌతున్నారని నివేదికలు పేర్కొంటుండటంతోపాటు చైనా దిగుమతులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తారనే భయాల వల్ల ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతుండట, సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ అర్జెంటినా పెసో గురువారం క్షీణించడంతో వర్ధమాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ఉండటం, కెనడా-అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతోన్న ఎన్‌ఏఎఫ్‌టీఏ డీల్‌ చర్చలపై శుక్రవారం ఒక నిర్ణయం వెలువడనుండటం, ఉద్యోగ కల్పన ఆశాజనకంగా లేకపోవడం సహా వాణిజ్య ఉద్రిక్తల నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ కొరియా తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను వరుసగా ఆరోసారి కూడా 1.50 శాతంగా స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, వచ్చే ఏడాది భారత్‌.. యూకేను వెనక్కు నెట్టి ఐదో అతిపెద్ద గ్లోబల్‌ ఎకానమీగా అవతరిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలియజేయడం, 2018-19 ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో భారత్‌ ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా నమోదవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అంచనా వేయడం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ అమెరికా రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీని కేంద్రం కోరడం, కార్లు/ద్విచక్ర వాహనదారులు థర్డ్‌ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి రావడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, పవర్‌ గ్రిడ్‌, సిప్లా, లుపిన్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  

 You may be interested

రూపీ పతనానికి అడ్డుఅదుపు లేదు..

Friday 31st August 2018

రూపాయి పతనమౌతూనే ఉంది. జూన్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం మరో కొత్త జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. తొలిసారిగా 71 స్థాయికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.74 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇక బీజింగ్‌తో ట్రేడ్‌వార్‌కు సిద్ధమౌతున్నారని నివేదికలు పేర్కొంటుండటం, చైనా దిగుమతులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తారనే భయాలు ప్రతికూల ప్రభావం

మార్కెట్‌ పయనం ఎటు?

Friday 31st August 2018

నిప్టీ-50 గురువారం కూడా రోజంతా రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. ఆగస్ట్‌ ఎక్స్‌పైరీ ముగింపు కారణంగా నష్టాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌ ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. సెషన్‌ మొత్తం బలహీనంగా ఉంది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో చిన్న బేరిష్‌ క్యాడిల్‌ను ఏర్పరచింది. ఇది హ్యమర్‌ రకపు ప్యాట్రన్‌ మాదిరిగా ఉంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.13 శాతంమేర పెరిగింది. సెక్టోరల్‌ ట్రెండ్‌ మిశ్రమంగా ఉంది. నిఫ్టీ ఆటో, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.5 శాతంమేర

Most from this category