STOCKS

News


10,900 లోపునకు నిఫ్టీ

Friday 28th September 2018
Markets_main1538124669.png-20678

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి వెళ్లడం ఇటీవల కాలంలో సాధారణమైంది. నిఫ్టీ-50 మళ్లీ 10,900 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నాం 2:15 సమయంలో సెన్సెక్స్‌ 183 పాయింట్ల నష్టంతో 36,141 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 10,888 పాయింట్ల వద్ద ట్రేడవతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 36,552 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే 36,101 కనిష్ట స్థాయికి పతనమైంది. అంటే గరిష్ట స్థాయి నుంచి 450 పాయింట్లకుపైగా పడిపోయింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,034- 10,879 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. 155 పాయింట్ల మేర క్షీణించింది.   
నిఫ్టీ-50లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి. అదేసమయంలో యస్‌ బ్యాంక్‌ షేరు 14 శాతంమేర పతనమైంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8 శాతానికిపైగా పడిపోయింది. హీరో మోటొకార్ప్‌, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 5 శాతానికిపైగా నష్టపోయాయి. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు 4 శాతానికిపైగా క్షీణించాయి. వేదాంత 3 శాతానికిపైగా పడిపోయింది. 
సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు బాగా పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు పెరిగాయి. 
కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,324 పాయింట్లతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 36,452 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,977 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 11,008 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 



You may be interested

కరిగిన మెటల్‌, రియల్టి షేర్లు

Friday 28th September 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా శుక్రవారం ట్రేడింగ్‌లో మెటల్‌, రియల్టీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ అత్యధికంగా 5శాతం నష్టపోగా, రియల్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు 5శాతం నష్టపోయింది. నిఫ్టీ మెటల్‌ మెటల్‌ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 3,669.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత కొంతకాలంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతున్న మెటల్‌ షేర్లలో నేడు ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఏడాది కనిష్టానికి 360 షేర్లు

Friday 28th September 2018

ముంబై:- ఆసియా మార్కెట్‌ నుంచి అందుతున్న ప్రతికూల ప్రభావంతో శుక్రవారం సూచీలు లాభనష్టాల నడుమ ఊగిసలాడుతున్నాయి. సూచీల ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో 360 షేర్లు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. వాటిలో యస్‌బ్యాంకు, మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్‌, టాటా మోటర్స్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు తాజాగా ఏడాది కనిష్టానికి పతనయ్యాయి. వాటితో పాటు అపోలో టైర్స్‌, వోడాఫోన్‌ ఐడియా, ఐడీఎఫ్‌సీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, అరవింద్‌, బ్యాంకు ఆఫ్‌

Most from this category