STOCKS

News


నష్టాల ప్రారంభం

Tuesday 20th November 2018
Markets_main1542686523.png-22214

  • 10,750 దిగువున నిఫ్టీ
  • 35,730 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభం

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,763 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల నష్టంతో 10,740 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,774 పాయింట్లతో పోలిస్తే 44 పాయింట్ల నష్టంతో 35,730 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌, ఐటీ స్టాక్స్‌ ఎక్కువగా క్షీణించాయి. 

రిజర్వు బ్యాంక్‌ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న రూ.8,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుండటం, కేంద్ర ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య సోమవారం జరిగిన సమావేశంలో దాదాపు కీలక అంశాలన్నిటి మధ్య సయోధ్య కుదరడం, అమెరికా నుంచి ఉత్పత్తి పెరగడం, డిమాండ్‌ వృద్ధి మందంగించడం వంటి అంశాల నేపథ్యంలో ఒపెక్‌ గ్రూప్‌ త్వరలో ఓవర్‌ సప్లైను నియంత్రించేందుకు క్రూడ్‌ సరఫరాను తగ్గిస్తుందనే అంచనాల వల్ల క్రూడ్‌ ధరలు మంగళవారం నిలకడగా ఉండటం, రూపాయి సోమవారం 26 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే పది వారాగా గరిష్ట స్థాయి 71.67 వద్ద ముగియడం,  ఇన్వెస్టర్లు ఆఫ్‌షోర్‌ ఇండియా ఫండ్స్‌/ ఈటీఎఫ్‌ల నుంచి సెప్టెంబర్‌ క్వార్టర్‌లో నికరంగా 1.8 బిలియన్‌ డాలర్ల నిధులను వెనక్కు తీసుకెళ్లడం, బిట్‌ కాయిన్‌ ధర 5,000 డాలర్ల దిగువకు క్షీణించడం, టెక్నాలజీ స్టాక్స్‌ పతనం వల్ల అమెరికా మార్కెట్లు సోమవారం బాగా పడిపోవడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో గెయిల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్‌, ఐఓసీ, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, విప్రో, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  యస్‌ బ్యాంక్‌ 5 శాతానికి పైగా పడిపోయింది. గెయిల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం షేర్లు దాదాపు 3 శాతం మేర లాభపడ్డాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పడిపోయాయి. You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 20th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఫోర్టీస్‌ మలార్‌ హాస్పిటల్‌:- సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పదవికి విజయశరత్‌ దిక్షాన్‌ రాజీనామా చేశారు. ఎస్కార్ట్‌:- రూ.100 కోట్ల వాణిజ్య పేపర్ల ఇష్యూకు ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ క్రిసెల్‌ ఏ1(+) రేటింగ్‌ను కేటాయించింది. ఎన్‌ఎండీసీ:- దొనిమలై మైనింగ్ లీజ్‌ సమస్యపై స్పష్టతనిచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ లీజ్‌ను రద్దు చేస్తున్నట్లు వెలువడిన వార్తలను ఖండించింది. దొనిమలై మైనింగ్‌ లీజును నవంబర్‌ 4నుంచి

10డెలివరీ.కామ్‌ సేవలు ప్రారంభం

Tuesday 20th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన డెలివరీ స్టార్టప్‌ 10డెలివరీ.కామ్‌ ప్రాంతీయ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఉచిత పికప్స్, వేగవంతమైన డెలివరీ తమ లక్ష్యమని 10 డెలివరీ.కామ్‌ను ప్రమోట్‌ చేస్తున్న యాడ్‌నిగమ్‌ ఫౌండర్‌ రాజిరెడ్డి కేసిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని వ్యాపారస్తులు, ట్రేడర్లకిది చాలా ఉపయుక్తంగా ఉంటుందని, డాక్యుమెంట్లు, తేలికపాటి పార్సిళ్ల వంటివి తక్కువ ధరలో డెలివరీ చేస్తామని చెప్పారాయన. తొలి ఆర్డర్‌రు రూ.10

Most from this category