STOCKS

News


భారీ గ్యాప్‌డౌన్‌..

Thursday 11th October 2018
Markets_main1539229927.png-21024

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం భారీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,760 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 697 పాయింట్ల నష్టంతో 34,063 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,460 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 291 పాయింట్ల నష్టంతో 10,169 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 2.8 శాతంమేర పతనమయ్యాయి.

పతనానికి కారణాలివే..
► అమెరికా మార్కెట్లు బుధవారం మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికిపైగా పతనమైంది. ఫిబ్రవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. బాండ్‌ ఈల్డ్స్‌ పెరడగం, టెక్నాలజీ స్టాక్స్‌ (మరీ ముఖ్యంగా ఫ్యాంగ్‌ స్టాక్స్‌) కుదేలవ్వడం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 832 పాయిం‍ట్ల (2.2 శాతం) నష్టంతో 25,598 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 95 పాయింట్ల (3.29 శాతం) నష్టంతో 2,785 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 316 పాయింట్ల (4.08 శాతం) నష్టంతో 7,422 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లలోని అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు నెగటివ్‌ ప్రభావం చూపాయి. గురువారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలున్నాయి. దీంతో వడ్డీ రేట్ల వేగంగా పెరగొచ్చనే భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. 

► ఫేస్‌బుక్‌, గూగుల్‌ పేరెంట్‌ అల్ఫాటెల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ స్టాక్స్‌ ఏకంగా 6 శాతానికిపైగా పతనమయ్యాయి. 2012 నుంచి చూస్తే ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.

► అమెరికా మార్కెట్ల పతనాన్ని అనుసరిస్తూ ఆసియా మార్కెట్లు కూడా గురువారం భారీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండెక్స్‌లు 3-5 శాతం శ్రేణిలో పతనమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 1020 పాయింట్ల (4.34 శాతం) భారీ నష్టంతో 22,499 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 978 పాయింట్ల (3.73 శాతం) భారీ నష్టంతో 25,214 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 82 పాయింట్ల నష్టంతో 3,049 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ ఏకంగా 614 పాయిం‍ట్ల (5.87 శాతం) నష్టంతో 9,851 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 121 పాయింట్ల (4.47 శాతం) నష్టంతో 2,604 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 81 పాయింట్ల (3.64 శాతం) నష్టంతో 2,147 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

►క్రూడ్‌ ధరలు గురువారం తగ్గాయి. అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు అంచనాల కన్నా ఎక్కువ పెరగడం, గ్లోబల్‌ మార్కెట్లు పతనం కావడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 82.43 డాలర్ల వద్ద, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 72.60 డాలర్ల వద్ద ఉంది. 

► సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు 23 శాతంమేర తగ్గాయి. 



You may be interested

కొత్త కనిష్టానికి రూపీ

Thursday 11th October 2018

ఇండియన్‌ రూపాయి గురువారం మరో కొత్త కనిష్ట స్థాయికి పతనమైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో అమ్మకాల సునామీ, ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:07 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.42 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపు 74.22తో పోలిస్తే 0.26 శాతం నష్టపోయింది. రూపాయి గురువారం 74.31 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 74.46 స్థాయికి కూడా పతనమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రాష్‌..

Thursday 11th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:35 సమయంలో ఏకంగా 271 పాయింట్ల నష్టంతో 10,208 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,465 పాయింట్లతో పోలిస్తే 257 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ఆసియా మార్కెట్లు ఢమాల్‌.. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ

Most from this category