STOCKS

News


10,110 దిగువకు నిఫ్టీ

Tuesday 23rd October 2018
Markets_main1540283362.png-21405

ఎన్‌ఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ-50.. 11,110 పాయింట్ల దిగువకు పతనమైంది. ఇది 7 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మంగళవారం మధ్యాహాం 1:55 సమయంలో నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 10,105 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 381 పాయింట్ల నష్టంతో 33,753 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. కాగా నిఫ్టీ అక్టోబర్‌ 11న 10,138 పాయింట్లకు క్షీణించింది. తాజాగా ఇప్పుడు ఇండెక్స్‌ దీని దిగువకు పతనమైంది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇండెక్స్‌లు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. 

నిఫ్టీ-50లో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2 శాతం పెరిగాయి. టాటా మోటార్స్‌ దాదాపు 1 శాతంమేర లాభపడింది. అదేసమయంలో ఏసియన్‌ పెయింట్స్‌ 6 శాతంమేర పతనమైంది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 5 శాతానికిపైగా నష్టపోయింది. విప్రో, సన్‌ ఫార్మా షేర్లు 4 శాతానికిపైగా పడిపోయాయి. యూపీఎల్‌, గ్రాసిమ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పతనమయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు 2 శాతంమేర పడిపోయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా నష్టపోయాయి. 



You may be interested

‘వ్యాల్యు’ చేకూర్చే స్టాక్స్‌ ఇవే..

Tuesday 23rd October 2018

మార్కెట్‌ నిపుణులు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో 10 స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  అనలిస్ట్‌: స్టీవెన్‌ బిర్చ్‌ (విలియమ్‌ ఓనీల్‌, ప్రెసిడెంట్‌) సిప్లా: ఫండమెంటల్స్‌ మెరుగవుతున్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో ఎర్నింగ్స్‌లో రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చు. దేశీ, ఆఫ్రికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి స్టాక్‌కు సానుకూల అంశం. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో టెక్నికల్‌గా చూసినా కూడా ఈ స్టాక్‌ పాజిటివ్‌గానే కనిపిస్తోంది. 200 రోజుల లైన్‌కు పైన

ఫార్మా షేర్లలో అమ్మకాలు

Tuesday 23rd October 2018

ఫార్మా ఐటీ షేర్ల పతనంతో మార్కెట్‌ మిడ్‌ సెషన్‌ సెషన్‌ సమయానికి అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అత్యధికంగా ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఫార్మా ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 3శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(9,646.65)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 9,392.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌

Most from this category