నిఫ్టీ 100 పాయింట్ల గ్యాప్‌అప్
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా నాల్గవ సెషన్ బుధవారం కూడా లాభాలతోనే ప్రారంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 35,162 పాయింట్లతో పోలిస్తే 381 పాయింట్ల లాభంతో 35,543 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,543 పాయింట్లతో పోలిస్తే 104 పాయింట్ల లాభంతో 10,688 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,710 పాయింట్లను తాకింది. కంపెనీలు ఎర్నింగ్స్ అదిరిపోవడంతో అమెరికా మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగియడం, అమెరికా మార్కెట్ల జోరు ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లో ట్రేడవుతుండటం, అమెరికా క్రూడ్ ఇన్వెంటరీలు తగ్గడం వల్ల క్రూడ్ ధరలు బుధవారం స్వల్పంగా పెరగడం, రూపాయి మంగళవారం 35 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 73.48 వద్ద ముగియడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా 14 కంపెనీలు బుధవారం క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం, పీ-నోట్ ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 9 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇక నిఫ్టీ-50లో ఇన్ఫోసిస్, గెయిల్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, వేదాంత షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హీరో మోటొకార్ప్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్ఫోసిస్ 3 శాతం పెరిగితే, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3 శాతంమేర పడిపోయింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు ఒక్క శాతానికిపైగా పెరిగాయి.
You may be interested
రెండు వారాల గరిష్టంలో రూపీ
Wednesday 17th October 2018ఇండియన్ రూపాయి బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.42 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన మంగళవారం ముగింపు 73.47తో పోలిస్తే 0.1 శాతం లాభపడింది. రూపాయి బుధవారం 73.34 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 7.885 శాతంగా ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ మునపటి ముగింపు 7.873 శాతంగా ఉంది. బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ
మార్కెట్ పయనం ఎటు?
Wednesday 17th October 2018బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ కంపెనీలు ఎర్నింగ్స్ అదిరిపోవడంతో అమెరికా మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. యునైటెడ్ హెల్త్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి దిగ్గజ కంపెనీలు బలమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉండటం మరో సానుకూల అంశం. దీంతో ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పెరిగాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 2.17 శాతం లేదా 547 పాయింట్ల లాభంతో 25,798 పాయింట్ల వద్ద ముగిసింది.