STOCKS

News


గ్యాప్‌అప్‌తో స్టార్ట్‌..

Friday 14th September 2018
Markets_main1536898352.png-20245

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,717 పాయింట్లతో పోలిస్తే 222 పాయింట్ల లాభంతో 37,939 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,369 పాయింట్లతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో 11,443 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 

అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ట్రేడవుతుండటం, పారిశ్రామికోత్పత్తి జూలైలో 6.6 శాతంగా నమోదవ్వడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో పది నెలల కనిష్ట స్థాయి 3.69 శాతానికి తగ్గడం, రూపాయి బుధవారం 72.91 స్థాయి నుంచి రికవరీ అయ్యి 72.19 వద్ద ముగియడం, అమెరికాలో వీక్లి జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ 49 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గడం, ప్రైవేట్‌ ఈక్విటీ/ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు ఆగస్ట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లుగా నమోదవ్వడం, కమోడిటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థలను అనుమతిచేందుకు సెబీ ఒప్పుకోవచ్చనే అంచనాలు, ఒపెక్‌ గ్రూప్‌ 2019 ఆయిల్‌ డిమాండ్‌ వృద్ధి నెమ్మదించొచ్చని అంచనా వేయడం, ఎగుమతులు ఆగస్ట్‌లో 19 శాతంమేర పెరగడం, అదేసమయంలో వాణిజ్య లోటు 17.4 బిలియన్‌ డాలర్లకు తగ్గడం, ఎన్‌ఎస్‌ఈఎల్‌ కేసుకు సంబంధించి దాదాపు 100కుపైగా బ్రోకరేజ్‌ సంస్థలపై సెబీ నిఘా ఉంచడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, బీపీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, యస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఐఓసీ, మారుతీ, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
ఒక్క ఐటీ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  



You may be interested

కోలుకున్న రూపాయి

Friday 14th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం బలపడింది. ఆగస్ట్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యానికి దిగువునే నమోదు కావడం సానుకూల ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. ఇది పది నెలల కనిష్ట స్థాయి. దీంతో ఆర్‌బీఐ అక్టోబర్‌ 5న జరగనున్న తన తదుపరి పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి.   ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.75

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 14th September 2018

బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత మార్నింగ్‌ సెషన్‌లో కరెక‌్షన్‌ అయ్యింది. అయితే మళ్లీ షార్ట్‌ కవరింగ్‌ వల్ల పుంజుకుంది. నిఫ్టీ ఇండెక్స్‌ 11,340 వద్ద ప​ఆరంభమైంది. ఇంట్రాడేలో 11,250 కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత 11,380కి పెరిగింది. చివరకు 82 పాయింట్ల లాభంతో 11,369 వద్ద ముగిసింది.  పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 11,286, 11,203 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 11,417,

Most from this category