STOCKS

News


లాభాలు అంతలోనే నష్టాలు

Thursday 30th August 2018
Markets_main1535601845.png-19773

బుధవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ మార్కెట్లు గురువారం పాజిటివ్‌గానే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,723 పాయింట్లతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో 38,797 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,692 పాయింట్లతో పోలిస్తే 3 పాయింట్ల స్వల్ప లాభంతో 11,695 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30 సమయంలో సెస్సెక్స్‌ 31 పాయింట్ల నష్టంతో 38,692 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 11,674 వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా క్రూడ్‌ ఇన్వెంటరీలు తగ్గడం సహా ఇరాన్‌తో పాటు వెనిజుల నుంచి క్రూడ్‌ సరఫరా తగ్గుతుందనే ఆందోళనలు నేపథ్యంలో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా పెరగడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 49 పైసలు మేర క్షీణించి 70.59 రికార్డ్‌ కనిష్ట స్థాయి వద్ద ముగియడం, ఇండియా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 7.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని రాయిటర్స్‌ పోల్‌లో వెల్లడవ్వడం, ఎఫ్‌పీఐలు ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ ఏడాదిలో 280 మిలియన్‌ డాలర్లు వెనక్కు తీసుకోవడం, అదే సమయంలో డీఐఐలు 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయడం, ఎఫ్‌డీఐలకు భారత్‌ గమ్య స్థానంగా కొనసాగుతోందని రిజర్వు బ్యాంక్‌ పేర్కొనడం, కేంద్ర ప్రభుత్వం విలీనానికి అనువైన బ్యాంకులను గుర్తించాలని ఆర్‌బీఐని కోరినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలియజేయడం, వచ్చే వారంలో అమెరికా అధికారుల భేటీలో ఇరాన్‌ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొనడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో పవర్‌ గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, ఐటీసీ, సన్‌ ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోల్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ, సిప్లా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక హిందుస్తాన్‌ పెట్రోలియం, ఐఓసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫిన్‌ సర్వీస్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.  

 You may be interested

రూపాయి: మళ్లీ ఆల్‌టైమ్‌ కనిష్టానికి

Thursday 30th August 2018

ఇండియన్‌ రూపాయి క్షీణిస్తూనే ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం మరో కొత్త జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆసియా కరెన్సీ మార్కెట్లు నష్టాల్లో ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 70.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 70.59తో పోలిస్తే 0.16 శాతం క్షీణించింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.69 వద్ద

మార్కెట్‌పై వీటి ప్రభావం..

Thursday 30th August 2018

నిప్టీ-50 బుధవారం ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. తర్వాత రోజంతా ఒక రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. చివరకు నష్టా‍ల్లో ముగిసింది. 11,700 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఇండెక్స్‌ డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. గురువారం రోజు ఆగస్ట్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ఉన్న విషయం తెలిసిందే.  నిఫ్టీ-50 బుధవారం 11,745 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. చివరకు 47 పాయింట్ల క్షీణతతో 11,691 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11,679 పాయింట్లు కనిష్ట

Most from this category