మళ్లీ లాభాల ప్రారంభం
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,737 పాయింట్లతో పోలిస్తే 73 పాయింట్ల లాభంతో 10,810 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్ తన మునపటి ముగింపు 35,779 పాయింట్లతో పోలిస్తే 245 పాయింట్ల లాభంతో 36,024 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.3 శాతానికి దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అక్టోబర్‌లో 8.1 శాతంగా నమోదవ్వడం, ఇండియన్ రూపాయి డిసెంబర్ 12న అమెరికా డాలర్‌తో పోలిస్తే 16 పైసలు క్షీణించి 72.01 వద్ద ముగియడం, వాషింగ్టన్- బీజింగ్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల భయాలు తగ్గడం సహా అమెరికాలో ఇన్వెంటరీలు తగ్గడం వల్ల క్రూడ్ ధరలు గురువారం స్వల్పంగా పెరగడం, ఒత్తిడితో కూడిన డెట్/ మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్స్‌కు సంబంధించిన పోర్ట్‌ఫోలియోలను వేరు చేయడానికి అనుమతించాలని సెబీ బోర్డు నిర్ణయం తీసుకోవడం, నవంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.1.4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు రావడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాలతో ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగియడం, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మేపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. నిఫ్టీ-50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, వేదాంత, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సన్ ఫార్మా, సిప్లా, హీరో మోటొకార్ప్, యూపీఎల్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సన్ ఫార్మా 2 శాతానికి పైగా పడిపోయింది. సిప్లా 1 శాతానికి పైగా నష్టపోయింది. ఇక ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4 శాతం మేర ఎగసింది. యస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, వేదాంత షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. ఒక్క నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మినహా మిగతా సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ రియల్టీ సహా మిగతా ఇండెక్స్‌లు దాదాపు 1 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా మాత్రం దాదాపు 1 శాతం మేర క్షీణించింది.
You may be interested
రూపీ అప్..
Thursday 13th December 2018ఇండియన్ రూపాయి గురువారం బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 30 పైసలు లాభంతో 71.71 వద్ద ప్రారంభమైంది. రూపాయి బుధవారం ముగింపు స్థాయి 72.01గా ఉంది. ఎన్ఎస్ఈలో డాలర్- రూపాయి డిసెంబర్ కాంట్రాక్ట్ గత సెషన్లో 72.11 వద్ద ఉంది. డిసెంబర్ కాంట్రాక్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గత సెషన్లో 4.31 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరెక్ట్ తెలిపింది. అమెరికా డాలర్- ఇండియన్ రూపాయి మారక విలువకు అధిక స్థాయిల్లో నిరోధం
మార్కెట్ పెరుగుతుందా?
Thursday 13th December 2018గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ≈ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 48 పాయింట్ల లాభంతో 10,836 పాయింట్ల వద్ద ఉంది. ≈ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 2.3 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్‌లో ఇది 3.31 శాతంగా నమోదయ్యింది. గతేడాది నవంబర్‌లో 4.88 శాతంగా ఉంది. ≈ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అక్టోబర్‌లో 8.1 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఇది 4.5 శాతం. ≈ ఇండియన్