STOCKS

News


4 వారాల గరిష్టానికి సూచీలు

Friday 16th November 2018
Markets_main1542343768.png-22064

  • 35,500 పాయింట్లకు పైన సెన్సెక్స్‌
  • 10,700 దిశగా నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలు మరంత పెరిగాయి. ఉదయం 10:05 సమయంలో సెన్సెక్స్‌ 240 పాయింట్ల లాభంతో 35,501 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 10,682 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,529 పాయింట్ల గరిష్ట స్థాయిని, నిఫ్టీ 10,689 గరిష్ట స్థాయిని తాకాయి. ఇండెక్స్‌లు అక్టోబర్‌ 17 తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. 

ఇక నిఫ్టీ-50లో ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో యస్‌ బ్యాంక్‌ 6 శాతంమేర పడిపోయింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4 శాతంమేర నష్టపోయింది. ఓఎన్‌జీసీ, ఐఓసీ షేర్లు 2 శాతానికి పైగా తగ్గాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ రియల్టీ మినహా మిగతావన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 1 శాతానికి పైగా పెరిగింది. బ్యాంక్‌ ఇండెక్స్‌ 26,205 పాయింట్ల వద్ద ఉంది. 
 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు

Friday 16th November 2018

మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ లాభపడుతూ సూచీల ర్యాలీకి బాసటగా నిలుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1శాతం లాభపడింది. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (26155)తో పోలిస్తే 26300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 11 షేర్లలో 9 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 16th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌:- నవంబర్‌ 16న జరిగే బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చించనున్నారు. సికాల్‌ లాజిస్టిక్స్‌:-  మూలధన అవసరాలకు నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు బోర్డు సభ్యులు నవంబర్‌ 17న బోర్డు సమావేశం నిర్వహించనుంది. షాలిమార్‌ పేయింట్స్‌:- మూలధన అవసరాలకు నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు బోర్డు సభ్యులు నవంబర్‌ 17న బోర్డు సమావేశం నిర్వహించనుంది. గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌:- టెర్రిఫ్లూనోమైడ్‌ ఔషధాలకు

Most from this category