STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 30th November 2018
Markets_main1543550585.png-22499

  • 10,900 పైన ట్రేడవుతోన్న నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ పెరిగింది. శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,858 పాయింట్లతో పోలిస్తే 34 పాయింట్ల లాభంతో 10,892 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,170 పాయింట్లతో పోలిస్తే 134 పాయింట్ల లాభంతో 36,304 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,900 మార్క్‌ను అధిగమించింది. 

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7-7.4 శాతం శ్రేణిలో వృద్ధి చెందొచ్చని ఎన్‌సీఏఈఆర్‌ అంచనా వేయడం, ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 29న 77 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.85 వద్ద ముగియడం, అమెరికాలో క్రూడ్‌ నిల్వలు పెరగడం వల్ల ఆయిల్‌ ధరలు శుక్రవారం తగ్గడం, కమోడిటీ ట్రేడింగ్‌ సమయాన్ని సెబీ మరికొన్ని గంటలు పెంచే అవకాశముండటం, ఆర్‌బీఐ.. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి అసెట్‌ సెక్యురిటైజేషన్‌ నిబంధనలను సరళీకరించడం, అలాగే ఎంఎస్‌ఎంఈ ఎగుమతిదారులకు వడ్డీ సబ్సిడీని 5 శాతానికి పెంచడం, అమెరికా మార్కెట్లు గురువారం నష్టపోవడం, కొస్పి.. నికాయ్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లోనే ట్రేడవుతుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ-50లో యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్‌ షేరు 2 శాతానికి పైగా పడిపోయింది. ఇక అదానీ పోర్ట్స్‌ 1 శాతానికి పైగా నష్టపోయింది. యస్‌ బ్యాంక్‌ 6 శాతం మేర పెరిగింది. ఇక ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ దాదాపుగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మాత్రం నష్టాల్లోనే ఉంది. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 30th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎన్‌బీఎస్‌సీ షేర్లు:- ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య లభత్యను పెంచేందుకు ఆర్‌బీఐ చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీల సెక్యూరిటైజేషన్ లావాదేవీల నిబంధనలను సవరించడంతో పాటు కనీస హోల్డింగ్‌ కాలపరిమితిని 5ఏళ్లకు పెంచింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో నేడు ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, భారత్‌ ఫైనాన్స్‌, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం

మార్కెట్‌ ఎటు?

Friday 30th November 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే...  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో 32 పాయింట్ల లాభంతో 10,947 పాయింట్ల వద్ద ఉంది.  ♦ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7-7.4 శాతం శ్రేణిలో వృద్ధి చెందొచ్చని ఎన్‌సీఏఈఆర్‌ అంచనా వేసింది.  ♦ ఇండియన్‌ రూపాయి నవంబర్‌ 29న 77 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.85 వద్ద

Most from this category