STOCKS

News


గ్యాప్‌డౌన్‌ మార్కెట్‌

Thursday 6th December 2018
Markets_main1544069547.png-22677

  • 10,700 దిగువున నిఫ్టీ
  • 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,782 పాయింట్లతో పోలిస్తే 64 పాయింట్ల నష్టంతో 10,718 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,884 పాయింట్లతో పోలిస్తే 190 పాయింట్ల నష్టంతో 35,694 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:34 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 314 పాయింట్ల నష్టంతో 35,569 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 10,687 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం, కెనడా అధికారులు హువావే సీఎఫ్‌వోను అరెస్ట్‌ చేయడంతో అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలు పెరగొచ్చనే భయాలు తలెత్తడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే ఏడాది ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించొద్దని ఒపెక్‌ దేశాలను కోరడం, క్రూడ్‌ ధరలు గురువారం తగ్గడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ద్రవ్యోల్బణ అంచనాలను 2.7-3.2 శాతానికి తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతమిచ్చే అగ్రి పాలసీకి క్యాబినేట్‌ ఆమోద ముద్ర వేయవచ్చనే అంచనాలు, ఆర్‌బీఐ.. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యం పరిష్కారం కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుండటం, ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 5న 3 పైసలు బలపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.46 వద్ద ముగియడం, ఇంట్రెస్ట్‌ రేట్‌ డెరివేటివ్‌ మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐలు పాల్గొనేందుకు ఆర్‌బీఐ నిబంధనలను విడుదల చేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, మారుతీ సుజుకీ, యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  వేదాంత 3 శాతానికి పైగా పడిపోయింది. హిందాల్కో 3 శాతం మేర క్షీణించింది. ఇక టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2 శాతానికిపైగా నష్టపోయాయి. సన్‌ ఫార్మా 3 శాతం మేర పెరిగింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.  



You may be interested

71 సమీపంలో రూపీ..

Thursday 6th December 2018

ఇండియన్‌ రూపాయి గురువారం నష్టాల్లో ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 71 సమీపంలో కదలాడుతోంది. రూపాయి తన మునపటి ముగింపుతో (70.46)పోలిస్తే 50 పైసలు క్షీణతతో 70.96 వద్ద ఉంది. బుధవారం నాటి ఆర్‌బీఐ పాలసీ రేట్లు నిర్ణయం వెలువడక ముందు రూపాయి 70.30-70.80 రేంజ్‌లో కదలాడింది. ఆర్‌బీఐ తన పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్‌ఎల్‌ఆర్‌ను 25 బేసిస్‌ పాయిం‍ట్ల మేర తగ్గించింది.

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 6th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు:  టాటా మోటర్స్‌:- బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లేలాండ్‌ అమ్మకాలు నవంబర్‌ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఇదే నవంబర్‌లో కంపెనీ మొత్తం 8895 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది నవంబర్‌లో అమ్మకాలు 9055 యూనిట్లుగా నమోదయ్యాయి. జాగ్వార్‌ వాహన అమ్మకాలు క్షీణించాయి. ఈ నవంబర్‌లో 2716 జాగ్వర్‌ అమ్మకాలను జరపగా, గతేడాది ఇదే నెలలో ఏకంగా 6241 వాహనాలను విక్రయించింది.

Most from this category