News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌...10,160 స్థాయికి నిఫ్టీ

Tuesday 23rd October 2018
Markets_main1540267278.png-21373

  • సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌
  • 34,000 దిగువున ప్రారంభం

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,134 పాయింట్లతో పోలిస్తే 199 పాయింట్ల నష్టంతో 33,935 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,245 పాయింట్లతో పోలిస్తే 93 పాయింట్ల నష్టంతో 10,152 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. 

అమెరికా మార్కెట్‌ సోమవారం దాదాపుగా నష్టాల్లోనే ముగియడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్‌ ఇష్యూ/ఇటలీ బడ్జెట్‌/ సౌదీ అరేబియా సంబంధిత అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం భారీ నష్టాలతో ట్రేడవుతుండటం, ఎనర్జీ మార్కెట్‌లో బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తామని సౌదీ అరేబియా ప్రకటించడంతో క్రూడ్‌ ధరలు మంగళవారం నిలకడగానే ఉండటం, రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 24 పైసలు క్షీణించి 73.56 వద్ద ముగియడం, హెచ్‌సీఎల్‌ టెక్‌ సహా దాదాపు 43 కంపెనీలు మంగళవారం క్యూ2 ఫలితాలను వెల్లడించనుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ మూడవ వారం నాటికి దేశీ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించడం, బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ పేర్కొనడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

ఇక నిఫ్టీ-50లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, గెయిల్‌, టైటాన్‌, హిందాల్కో షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌, యూపీఎల్‌, హెచ్‌యూఎల్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఏసియన్‌ పెయింట్స్‌ 5 శాతానికిపైగా పతనమైంది. హిందుస్తాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు 3 శాతంమేర క్షీణించాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2 శాతమేర లాభపడింది.  

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1 శాతంమేర క్షీణించింది. You may be interested

రూపీ పతనం

Tuesday 23rd October 2018

ఇండియన్‌ రూపాయి మంగళవారం కూడా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.73 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు 73.56తో పోలిస్తే 0.23 శాతం నష్టపోయింది. రూపాయి మంగళవారం 73.70 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.935 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.93 శాతంగా ఉంది. బాండ్‌

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 23rd October 2018

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌:- భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి రూ.366.36 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్స్‌ కార్పోరేషన్‌:- కంపెనీ ప్రస్తుత పేరును ఆర్‌ఈసీ లిమిటెడ్‌గా మార్చుకునేందుకు మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేషన్‌ అఫైర్స్‌ శాఖ అనుమతినిచ్చింది. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌:- పలు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రపంచస్థాయి కంపెనీ ‘‘అవుట్‌ సిస్టమ్స్‌’’తో జట్టు కట్టనుంది. సైయంట్‌:- కంపెనీ స్వతంత్ర్య డైరెక్టర్‌గా వికాస్‌

Most from this category