STOCKS

News


లాభాలతోనే ఆరంభం..

Wednesday 8th August 2018
Markets_main1533700958.png-19026

స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 37,750 మార్క్‌కుపైన, నిఫ్టీ 11,410 మార్క్‌కుపైన ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు 37,666 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో  37,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ క్రితం ముగింపు 11,389 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 11,412 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగానే ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరల పెరుగుదల, మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు జూలై నెలలో 5 శాతం వృద్ధితో రూ.24 లక్షల కోట్లకు పెరగడం, చైనా నుంచి టెక్స్‌టైల్‌ ప్రొడక్టుల దిగుమతిని నియంత్రించేందుకు భారత్‌ దాదాపు 300 టెక్స్‌టైల్‌ ప్రొడక్టులపై దిగుమతి సుంకాలను రెట్టింపు చేయడం, ఒకవేళ రూపాయి విలువ 70 మార్క్‌కు కిందకు పడిపోయినా.. విదేశీ ఇన్వెస్టమెంట్లు పుంజుకోకపోయినా.. రిజర్వు బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడో త్రైమాసికంలో 30-35 బిలియన్‌ డాలర్ల విలువైన నాన్‌-రెసిడెంట్‌ (ఎన్‌ఆర్‌ఐ) బాండ్లను జారీ చేసే అవకాశముందని అమెరికా మెరిల్‌ లించ్‌ అంచనా వేయడం, రూపాయి మంగళవారం రెండు వారాల కనిష్ట స్థాయి నుంచి రికవరీ కావడం, ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిల్‌ఔట్‌ ప్యాకేజ్‌ యోచన, 178 కంపెనీలు బుధవారం జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించనుండటం వంటి అంశాలు మారెర్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో హిందాల్కో, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా, వేదాంత, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, టైటాన్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫిన్‌ సర్వీస్‌, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియల్టీ మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉన్నాయి. 
 



You may be interested

రూపాయి అప్‌..

Wednesday 8th August 2018

68.66 వద్ద ప్రారంభం మంగళవారం ముగింపు 68.69తో పోలిస్తే 0.05 శాతం పెరుగుదల ఇండియన్‌ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. దేశీ మార్కెట్లు సానుకూలముగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఉదయం 9:12 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.64 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.69తో పోలిస్తే 0.05 శాతం పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 68.66 వద్ద ప్రారంభమైంది.  క్రూడ్‌

నేటి మార్కెట్‌పై ప్రభావిత అంశాలు

Wednesday 8th August 2018

మార్కెట్లు మంగళవారం గరిష్ట స్థాయిల్లో ప్రాంభమయ్యాయి. అయితే చివరకు ఫ్లాట్‌గానే ముగిశాయి. దీని కన్నా ముందు ఇంట్రాడేలో ఒకానొక సమయంలో కొత్త గరిష్ట స్థాయిలను తాకింది. నిఫ్టీ ఇండెక్స్‌.. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పర్చింది. అందువల్ల ముగింపు స్థాయి..  ప్రారంభ స్థాయి కన్నా తక్కువగా ఉంది.  సెన్సెక్స్‌ 26 పాయింట్ల నష్టంతో 37,666 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతంమేర పడిపోయింది. సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి.  నిఫ్టీ

Most from this category