STOCKS

News


గ్యాప్‌అప్‌ మార్కెట్‌

Friday 7th December 2018
Markets_main1544155315.png-22712

  • సెన్సెక్స్‌ 180 పాయింట్లు అప్‌
  • 10,650 సమీపంలో నిఫ్టీ

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,601 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 10,644 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,312 పాయింట్లతో పోలిస్తే 182 పాయింట్ల లాభంతో 35,494 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. 

అమెరికా క్రూడ్‌ నిల్వలు తగ్గడం వల్ల క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగానే ఉండటం,  ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 6న 44 పైసలు క్షీణించి.. అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.90 వద్ద ముగియడం, ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ ధరల క్షీణతను అడ్డుకునేందుకు ఆయిల్‌ సరఫరా తగ్గించొచ్చనే అంచనాలు నెలకొనడం, క్రూడ్‌ దిగుమతుల బిల్లును రూపాయిల్లో చెల్లించేందుకు ఇరాన్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకోవడం, ప్రైవేట్‌ ఈక్విటీ/ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్లు 2018 జనవరి-నవంబర్‌ మధ్య కాలంలో 27 బిలియన్‌ డాలర్లుగా నమోదుకావడం, యూనిపార్ట్స్‌ ఇండియా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించడం, అమెరికా డాలర్‌- ఇండియన్‌ రూపాయి వీక్లి ఆప్షన్స్‌కు సెబీ నుంచి ఎంఎస్‌ఈకి అనుమతి లభించడం, కేం‍ద్ర ప్రభుత్వం కోల్‌ ఇండియాలోని 2.21 శాతం వాటాను సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు విక్రయించడం, ఆర్‌ఈసీలో కేంద్ర ప్రభుత్వ వాటాను పీఎఫ్‌సీకి విక్రయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలపడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు గురువారం రికవరీ అవ్వడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ-50లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐఓసీ, సిప్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు దాదాపు 5 శాతం మేర పతనమైంది. గెయిల్‌, విప్రో షేర్లు 2 శాతానికిపైగా పడిపోయాయి. ఐవోసీ స్టాక్‌ 2 శాతానికి పైగా లాభపడింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు దాదాపు 2 శాతం మేర పెరిగింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా పడిపోయింది. ఇక నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఇక మిగతావన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. 



You may be interested

రూపీ కళకళ

Friday 7th December 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం లాభాల్లో ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆరంభంలోనే 34 పైసలు బలపడింది. 70.56 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది.  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరా తగ్గింపు తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. నాన్‌-ఒపెక్‌ హెవీవెయిట్‌ దేశమైన రష్యా నుంచి మద్దతు కోసం వేచి చూస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 7th December 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:46 సమయంలో 59 పాయింట్ల లాభంతో 10,683 పాయింట్ల వద్ద ఉంది.  ♦క్రూడ్‌ ధరలు శుక్రవారం నిలకడగానే ఉన్నాయి. అమెరికా క్రూడ్‌ నిల్వలు తగ్గడం ఇందుకు కారణం. అయితే సెంటిమెంట్‌ మాత్రం బలహీనంగానే ఉంది. ఒపెక్‌ దేశాలు ఆయిల్‌ సరఫరాపై తుది నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే

Most from this category