News


10,700పైన నిఫ్టీ

Wednesday 28th November 2018
Markets_main1543377610.png-22425

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,685 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 10,708 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,513 పాయింట్లతో పోలిస్తే 122 పాయింట్ల లాభంతో 35,635 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

క్రూడ్‌ ధరలు బుధవారం పెరగడం, వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుండటం, ట్రేడింగ్‌ ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ.. క్లియరింగ్‌ కార్పొరేషన్లకు కోసం ఇంటర్‌-ఆపరబులిటీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకురావడం, రూపాయి నవంబర్‌ 27న 8 పైసలు బలపడి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.79 వద్ద ముగియడం, ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచుతుందనే సంకేతాల నేపథ్యంలో అమెరికా డాలర్‌ పరుగు పెట్టడం వల్ల బంగారం ధర వారం కనిష్ట స్థాయికి పడిపోవడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లోనే ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్లు మంగళవారం చివరకు లాభాల్లోనే ముగియడం, అమెరికా- చైనా అధ్యక్షుల మధ్య శనివారం జరగనున్న సమావేశంలో వాణిజ్య ఉద్రిక్తతలక ఒక పరిష్కారం లభించవచ్చని అమెరికా ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో ఆశాభావం వ్యక్తం చేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ-50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటొకార్ప్‌, టైటాన్‌, విప్రో, టీసీఎస్‌, గెయిల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, వేదాంత షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యస్‌ బ్యాంక్‌ 4 శాతానికి పైగా పతనమైంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దాదాపు 2 శాతం మేర తగ్గింది. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 3 శాతం మేర లాభపడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ దాదాపు 2 శాతం మేర పెరిగింది. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ 2 శాతానికి పైగా పెరిగింది. ఇక నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి. You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 28th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు యస్‌బ్యాంక్‌:- ఫారెన్‌ కరెన్సీ ఇష్యూకు రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు రేటింగ్‌ను సవరించింది. లుపిన్‌:- కంపెనీ ఛీప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పదవికి రమేష్‌ స్వామినాథన్‌ రాజీనామా చేశారు. రిలయన్స్‌ క్యాపిటల్‌:- ఈ క్యూ2లో కన్సాలిడేషన్‌ ప్రాతిపాదికన కంపెనీ రూ.280 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.163 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్వార్టర్‌లో కంపెనీ

మార్కెట్‌ ఎటు?

Wednesday 28th November 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:33 సమయంలో 35 పాయింట్ల లాభంతో 10,725 పాయింట్ల వద్ద ఉంది.  ♦ క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగాయి. వచ్చే వారంలో ఒపెక్‌ దేశాల సమావేశం జరగనుంది. ఇందులో ఆయిల్‌ సరఫరా తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 52

Most from this category