STOCKS

News


లాభాలు.. అంతలోనే నష్టాలు..

Wednesday 21st November 2018
Markets_main1542773451.png-22237

  • 10,670 వద్ద నిఫ్టీ ప్రారంభం
  • సెన్సెక్స్‌ 18 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,656 పాయింట్లతో పోలిస్తే 14 పాయింట్ల లాభంతో 10,670 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,474 పాయింట్లతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 35,492 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,336 పాయింట్ల కనిష్ట స్థాయికి, నిఫ్టీ 10,637 పాయింట్లకు పడిపోయాయి. ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్‌ 57 పాయింట్ల నష్టంతో 35,417 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 10,654 వద్ద ట్రేడవుతున్నాయి. 

మంగళవారం 6 శాతానికిపైగా పతనమైన క్రూడ్‌ ధరలు బుధవారం నిలకడగా ఉండటం, భారత్‌ జీడీపీ వృద్ధి రేటు జూలై-సెప్టెంబర్‌ కాలంలో 7.2 శాతానికి తగ్గొచ్చని ఇక్రా అంచనా వేయడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి వరుసగా ఆరవ సెషన్‌లోనూ పెరిగి.. మంగళవారం 21 పైసలు లాభంతో 71.46 వద్ద ముగియడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని (రూ.80,000 కోట్లు) చేరుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తంచేయడం, జిర్కాన్‌ టెక్‌ ఐపీవోకు మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ అనుమతినివ్వడం, అమెరికా మార్కెట్లు వరుసగా రెండో రోజూ మంగళవారం కూడా బాగా పడిపోవడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇక ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, వేదాంత, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏకంగా 8 శాతం మేర పెరిగింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం షేర్లు దాదాపు 5 శాతంమేర లాభపడ్డాయి. ఇక ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు దాదాపు 2 శాతంమేర పడిపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా 1.59 శాతం మేర పెరిగింది. దీని తర్వాత నిఫ్టీ పీఎస్‌ఈ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా లాభపడింది. నిఫ్టీ ఐటీ 1.8 శాతం మేర నష్టపోయింది. నిఫ్టీ మెటల్‌ 0.72 శాతం మేర తగ్గింది. 
 



You may be interested

నాలుగు కెమెరాల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్... తాజాగా గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 6జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వెర్షన్లలో లభించే ఫోన్ల ధర దీని ధర వెర్షన్‌ను బట్టి రూ.36,990- రూ.39,900గా ఉంది. వెనుకవైపున నాలుగు కెమెరాలు ఉండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ (512 జీబీ దాకా పెంచుకోవచ్చు), 3,800 ఎంఏహెచ్‌

మార్కెట్‌ ఎటు?

Wednesday 21st November 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 15 పాయింట్ల నష్టంతో 10,654 పాయింట్ల వద్ద ఉంది.  ♦ మంగళవారం 6 శాతానికిపైగా పతనమైన క్రూడ్‌ ధరలు బుధవారం నిలకడగా ఉన్నాయి. అమెరికాలో క్రూడ్‌ నిల్వలు అనూహ్యంగా తగ్గాయనే వార్తాలు బలం చేకూర్చాయి. రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న

Most from this category