News


మార్కెట్‌ రివర్స్‌.. నష్టాల్లో నిఫ్టీ

Wednesday 17th October 2018
Markets_main1539757671.png-21237

అమెరికా మార్కెట్లు మంగళవారం 2 శాతానికి పైగా ర్యాలీ చేయడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండటం, రూపాయి బలపడటం వంటి పలు సానుకూల అంశాల కారణంగా గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ తర్వాత ఆ లాభాలన్నింటికీ కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల్లోకి జారుకుంటే, సెన్సెక్స్‌ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఉదయం 11:46 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్‌ 28 పాయింట్ల లాభంతో 35,190 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,569 వద్ద ట్రేడవుతున్నాయి. కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాల్గవ సెషన్‌ బుధవారం కూడా భారీ లాభాలతోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,162 పాయింట్లతో పోలిస్తే 381 పాయింట్ల లాభంతో 35,543 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,543 పాయింట్లతో పోలిస్తే 104 పాయింట్ల లాభంతో 10,688 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ వెంటనే 10,710 పాయింట్లను తాకింది.   

నిఫ్టీ-50లో హెచ్‌సీఎల్‌ టెక్‌ 3 శాతంమేర లాభపడింది. కోల్‌ ఇండియా 2 శాతంమేర ఎగసింది. ఐటీసీ, ఇన్ఫోసిస్‌, పవర్‌ గ్రిడ్‌, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1 శాతానికిపైగా పెరిగాయి.  ఇదే సమయంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8 శాతానికిపైగా పతనమైంది. యస్‌ బ్యాంక్‌ 5 శాతానికిపైగా పడిపోయింది. బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందాల్కో, మారుతీ సుజుకీ షేర్లు 2 శాతానికిపైగా పడిపోయాయి. హిందుస్తాన్‌ పెట్రోలియం, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ షేర్లు 2 శాతంమేర తగ్గాయి. 

ఉదయం అన్ని సెక్టోరల్‌ ఇండెక్స్‌లు లాభాల్లోనే ట్రేడయ్యాయి. అయితే తర్వాత నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. 
 



You may be interested

10650-10700 పాయింట్ల వద్ద నిరోధం

Wednesday 17th October 2018

మంగళవారం బ్యాంకు నిఫ్టీ అండతో నిఫ్టీ బలంగా క్లోజయింది. పదిరోజుల డిఎంఏ స్థాయికి పైన ముగిసింది. దీనికితోడు మంగళవారం రాత్రి యూఎస్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో బుధవారం నిఫ్టీ గ్యాప్‌ అప్‌తో ఆరంభమైంది. కానీ వెనువెంటనే ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా నష్టాల్లోకి జారింది. నిఫ్టీకి 10650-10700 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఉందని ఎపిక్‌ రిసెర్చ్‌ తెలిపింది. ఈ స్థాయిలో‍్ల ప్రాఫిట్‌ బుకింగ్‌ వస్తుందని తెలిపింది. మదుపరులు

ఐటీ షేర్లకు ఇన్ఫోసిస్‌ ఫలితాల జోష్‌

Wednesday 17th October 2018

ముంబై:- ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో బుధవారం ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2శాతం లాభపడింది. ఉదయం గం.11:00లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 15,025.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇన్ఫోసిస్‌ నిన్న ప్రకటించిన క్యూ2 ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో ఈ

Most from this category